తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇప్పటివరకు డైనోసార్, ఇక డార్లింగ్- ప్రభాస్​ ఫ్యాన్స్ గెట్​ రెడీ !' - ప్రభాస్ మారుతి మూవీ

Prabhas Maruthi Movie Update : వరుస సినిమాలతో పాన్​ఇండియా స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్నారు. తాజాగా ప్రభాస్- మారుతి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు

Prabhas Maruthi Movie Update
Prabhas Maruthi Movie Update

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 9:07 AM IST

Updated : Dec 29, 2023, 9:56 AM IST

Prabhas Maruthi Movie Update :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 22 విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రభాస్ అదే ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇదివరకే మారుతితో ప్రకటించిన సినిమా నుంచి క్రేజ్​ అప్డేట్​ వచ్చింది.

సంక్రాంతి పండుగ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. 'ఇప్పుడు వరకు డైనోసార్ ప్రభాస్​ను చూశారు, ఇక డార్లింగ్ ప్రభాస్​ను చూసేందుకు సిద్ధం అవ్వండి' అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. అంతేకాకుండా ప్రభాస్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి మళ్లీ వింటేజ్ ప్రభాస్​ను ఫ్యాన్స్​ చూడనున్నారట.

ప్రభాస్​తో ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్​!
కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్​లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్​తో మంచి కామెడీ పండించబోతున్నారట మారుతి. ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది. ఒక బంగ్లా నేపథ్యంలోనే ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందంట.

ఈ మూవీ టైటిల్ రాజా డీలక్స్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా ఈ మూవీ చేస్తున్నారని టాక్. అందుకే రూ.100 నుంచి రూ.150 కోట్ల మధ్యనే ఈ సినిమాకు బడ్జెట్ అవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అంటే సినిమా సక్సెస్ తరువాత బిజినెస్​లో వాటా తీసుకునేలా ప్రభాస్​ డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్.

కల్కి విషయాలతో నాగ్​ అశ్విన్​!
మరోవైపు, ప్రభాస్ నటిస్తున్న ఇంకో మూవీ 'కల్కి 2898 ఏడి'. సైన్స్ ఫిక్షన్ జానర్​లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్​గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా గురించి తెలియని విశేషాలను అడిగి తెలుసుకునేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

IIT బాంబే Tech Fest 23 లో నాగ్ అశ్విన్ పాల్గొనబోతున్నారు. డిసెంబర్ 29న మధ్యాహ్నం గం.1:30 నిమిషాలలకు కన్వెన్షన్ హాల్ లో ఈ మీట్ జరగనుంది. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. కల్కి సినిమాకి సంబంధించిన అనేక విషయాలను నాగ్ అశ్విన్ ఈ మీట్​లో ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు.

Last Updated : Dec 29, 2023, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details