Prabhas Maruthi Film :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. దర్శకుడు మారుతితోనూ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని మొదని నుంచి ప్రచారం సాగుతోంది. 'డీలక్స్ రాజా' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే ఈ చిత్రాన్ని ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే ప్రారంభించి, కనీసం ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో అసలీ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.
అయితే ఎందుకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు? అసలు సైలెంట్‌గా ఎందుకు ఉంచుతున్నారు? అనేది కూడా ఇప్పటివరకు మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతి తెలివిగా సమాధానమిచ్చారు. రీజన్ చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.
"ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ను వదిలితే అటు ఫ్యాన్స్ ఇటు అభిమానులు గందరగోళానికి గురౌతారు. పైగా ముందుగానే వాటి అప్డేట్స్ కూడా బయటకు వచ్చేస్తే.. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి కాస్త హైప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది" అంటూ మారుతి సమాధానం చెప్పారు.