Prabhas Mangalore Temple:పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం కర్ణాటక వెళ్లారు. శుక్రవారం (జనవరి 12) సాయంత్రం ఈ ఈవెంట్ జరగనుంది. మూవీటీమ్, అతికొద్ది మంది సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, సినిమా నిర్మాత కిరగందూర్‌తో కలిసి మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరీ మాత ఆలయాన్ని సందర్శించారు.
ఆలయ అర్చకులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పూజారులు హీరో ప్రభాస్‌కు అమ్మవారి ఫొటోను అందించారు. ఆలయ నిర్వహకులతో ముచ్చటించిన ప్రభాస్, కాసేపు మందిరం ప్రాంగణంలో తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సలార్ విషయానికొస్తే, డిసెంబర్ 22న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా రిలీజైంది. సూపర్ హిట్ టాక్ అందుకున్న సలార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ఇక వరల్డ్‌వైడ్‌గా సలార్ పార్ట్ 1 రూ.700 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నటుడు పృథ్వీరాజ్, జగపతిబాబు, శ్రేయా రెడ్డి, ఝాన్సీ, సప్తగిరి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు.