Prabhas Lokesh Kanagaraj Movie : 'లియో' ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. తన చిత్రాలను ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రపంచాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 'ఖైదీ', 'విక్రమ్' చిత్రాలకు ఇప్పటికే లింక్ పెట్టారు. నెక్ట్స్ 'ఖైదీ 2', 'విక్రమ్ 2', అలాగే 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ పాత్రతో ఓ సినిమాను ఎల్‍సీయూలో చూపించబోతున్నారు. ఇప్పుడు 'లియో'(Leo Movie Release Date) చిత్రంతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది కూడా ఎల్‍సీయూలో భాగమేనని కథనాలు వచ్చాయి కానీ.. ఇంకా దీనిపై లోకేశ్ సరైనా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లోనే ప్రభాస్‍తో సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు.
తాజాగా ఇప్పుడు మరో ప్రమోషన్స్‌లో పాల్గొన్న లోకేశ్.. ఎల్‍సీయూలో ప్రభాస్ చిత్రం భాగామా కాదా అనే విషయమై కూడా స్పష్టత ఇచ్చేశారు. అది ఎల్‍సీయూలో భాగం కాదని చెప్పేశారు. స్టాండ్ అలోన్‌గా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి అస్సలు సంబంధం ఉండదని అన్నారు.
ప్రభాస్ కోసం ఒరిజినల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న ఫ్యాన్స్.. సంబరపడిపోతున్నారు. అయితే ఈ చిత్రం పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీరిద్దరి చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యే సరికి ఇంకా సమయం పడుతుంది.