తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​ ఈజ్ బ్యాక్​ - ఇక 'సలార్​' సందడి షురూ! - హైదరాబాద్​కు చేరుకున్న​ డార్లింగ్ ప్రభాస్​

Prabhas Returned Hyderabad : గత కొన్నిరోజులుగా విదేశాల్లో ఉన్న రెబల్​ స్టార్ ప్రభాస్​ తాజాగా హైదరాబాద్​కు చేరుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Salaar Prabhas Returned Hyderabad
Prabhas Returned Hyderabad

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 1:21 PM IST

Prabhas : మోకాలి గాయం కారణంగా చికిత్స కోసం యూరప్​ వెళ్లిన రెబల్​ స్టార్​ ప్రభాస్ తిరిగి​ హైదరాబాద్​కు వచ్చేశారు. రెండు నెలల పాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్న ఆయన తాజాగా హైదరాబాద్​ విమానాశ్రయంలో కనిపించారు. దీంతో డార్లింగ్​ ఫ్యాన్స్​ సంబరాల్లో మునిగిపోయారు. డిసెంబర్​ 22న 'సలార్​' విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొననున్నారని టాక్​. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అప్​డేట్​ రాలేదు.

ఇక అక్టోబర్​ 23న ప్రభాస్ బర్త్​డే సందర్భంగా ఏదైనా అప్​డేట్​ రిలీజ్​ చేస్తారనుకుంటే.. అటువంటివేమీ జరగలేదు. దీంతో ఫ్యాన్స్​ కాస్త డీలా పడ్డారు. అయినప్పటికీ రిలీజ్​ డేట్​ చేరువలో ఉండటం వల్ల ఫ్యాన్స్ మూవీ రిలీజ్​ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు డార్లింగ్​ కూడా హైదరాబాద్​కు వచ్చేయడం వల్ల సలార్​ స్పెషల్​ పోస్టర్​, ట్రైలర్ ఇలా మరిన్ని అప్డేట్స్​ వస్తాయేమోనని వెయిట్​ చేస్తున్నారు అభిమానులు.

మరోవైపు 'సలార్'​ ట్రైలర్​ కూడా రిలీజ్​ అవ్వకముందే దీనికి సంబంధించిన ఓటీటీ హక్కులను దక్కించుకుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​. ఏకంగా రూ.160 కోట్లకు ఈ రైట్స్​ను సొంతం చేసుకుంది. మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​.. ఇటీవలే నెట్​ఫ్లిక్స్​తో దీనికి సంబంధించిన భారీ డీల్​ను కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి వివరణ లేదు.

సలార్​Xడంకీ 'ఢీ'!
బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన 'డంకీ' కూడా డిసెంబర్​ 22నే విడుదల కానుంది. మాస్​మహారాజా రవితేజ 'ఈగల్​' కూడా ఈ టైమ్​లోనే విడుదలవుతుందన్న వార్తలు కూడా వైరల్​ అవుతున్నాయి. వాస్తవానికి 'సలార్​'ను ముందుగా సెప్టెంబర్​ 28నే విడుదల చేయాలని భావించినప్పటికీ.. పలు కారణాలతో డిసెంబర్​ 22కి వాయిదా వేశారు నిర్మాతలు. ఇక ఆ రోజు కూడా పలువురు పెద్ద హీరోలు కూడా రిలీజ్​కు సిద్ధంగా ఉండటం వల్ల సలార్​కు గట్టి పోటీనివ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సలార్​కు సంబంధించి ట్రైలర్​ కూడా త్వరలోనే రాబోతోందని సమాచారం.

కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయిన 'సలార్​' ఓటీటీ రైట్స్​- ఎన్ని కోట్లు అంటే?

'సినిమాలో నా పాత్ర ఓ సర్​ప్రైజ్​- కార్తితో నా ట్రాక్​ అదుర్స్​, 'జపాన్​' కోసం ఫుల్ వెయిటింగ్​'!

ABOUT THE AUTHOR

...view details