తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కన్నప్ప'లో ప్రభాస్ పాత్ర - మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - కన్నప్పలో ప్రభాస్ పాత్ర

Prabhas Kannappa Movie : మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్‌ పాత్రపై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు.

'కన్నప్ప'లో ప్రభాస్ పాత్ర - మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​
'కన్నప్ప'లో ప్రభాస్ పాత్ర - మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 6:47 PM IST

Updated : Jan 15, 2024, 6:57 PM IST

Prabhas Kannappa Movie : హీరో మంచు విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్‌గా రెడీ అవుతున్న మూవీ 'కన్నప్ప'. ఈ భారీ బడ్జెట్​ చిత్రానికి ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ నటిస్తున్నారంటూ ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్​ శివుడు పాత్రలో నటించనున్నారంటూ చాలా కథనాలు వచ్చాయి. గతంలో సీనియర్ నటి మధుబాల కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.

అయితే తాజాగా 'కన్నప్ప'లో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉంటుందో అన్న విషయంపై హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. సినిమాకు సంబంధించి అప్డేట్స్​ ఇచ్చారు. "కన్నప్ప చిత్రీకరణ 60 శాతం వరకు కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్​ చేస్తారంటూ నార్త్ ఆడియెన్స్​ కూడా అడుగుతున్నారు. ఈ ఏడాది చివర్లో 'కన్నప్ప'ను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్​ చేస్తాం. చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్​ ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్‌ ఉండదు. టైమ్​ వచ్చినప్పుడు చెబుతాను. మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాల్సి ఉంది. మిగిలిన షూటింగ్​ కూడా అక్కడే చేస్తాం. ఇంకా ఈ చిత్రంలో మా నాన్న మోహన్‌ బాబు, నా కుమారుడు అవ్రామ్‌ కూడా నటిస్తున్నారు" అని మంచు విష్ణు చెప్పారు.

ఈ చిత్రంతో మోడల్, క్లాసిక్ డ్యాన్సర్, భరత నాట్యంలో ప్రావీణ్యురాలైన ప్రీతి ముకుందన్‌(kannappa movie heroine) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ స్టార్​ హీరో శివరాజ్‌కుమార్​లు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. రీసెంట్​గా న్యూజిలాండ్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని మూవీ టీమ్​ భారత్‌కు తిరిగి వచ్చింది. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఈ OTTలోకే ఎన్టీఆర్​ 'దేవర', బాలయ్య 'NBK 109' - పుష్ప 2, సలార్​ కూడా

'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్​ గ్లింప్స్​ - రిలీజ్ డేట్ ఇదే

Last Updated : Jan 15, 2024, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details