తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kamal haasan project k : కమల్​హాసన్​పై ప్రభాస్​ కామెంట్స్​.. 'ఆయనకు నేనెవరో తెలీదంటూ..' - project k kamalhassan

Prabhas Kamal haasan : యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​.. ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె'లో నటిస్తున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్​మెంట్​ వచ్చింది. ఈ సందర్భంగా కమల్​పై ప్రభాస్​ చేసిన కామెంట్స్​ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ సంగతులు..

Prabhas Kamal haasan
కమల్​హాసన్​కు నేనెవరో తెలీదు : ప్రభాస్​

By

Published : Jun 25, 2023, 3:56 PM IST

Prabhas Kamal haasan : 'బాహుబలి' సిరీస్​తో ఇండియన్​ సినిమా హిస్టరీలో పాన్​ ఇండియా ట్రెండ్​ మొదలైందన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్​ చిత్రాలతోనే ప్రభాస్​ పాన్​ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్​ స్టార్​ కమల్ హాసన్ లాంటి వాళ్లు గతంలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఫుల్ క్రేజ్​ సంపాదించుకున్నారు. తమ సినిమాలతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. అలా ఈ ముగ్గురు ఇప్పుడు కలిసి నటిస్తున్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. తాజాగా మూవీటీమ్​ ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్​ చేస్తూ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ కూడా చేసింది. దీంతో సోషల్​మీడియాలో కమల్​ హాసన్​-ప్రభాస్​ పేర్లతో హ్యాష్​ట్యాగ్​ ఫుల్ ట్రెండ్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఓ ఈవెంట్​లో ప్రభాస్​-కమల్​హాసన్​తో మాట్లాడిన ఓ వీడియోను అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇది పదేళ్ల క్రితం జరిగింది. అయితే అప్పటికీ ప్రభాస్​ క్రేజ్​ కేవలం టాలీవుడ్​కే మాత్రం పరిమితం. ఆ సమయంలోనే కమల్​హాసన్​ 'విశ్వరూపం' అనే చిత్రాన్ని చేశారు. దీని సక్సెస్​ మీట్​కు ప్రభాస్​ హాజరయ్యారు. ఆ సమయంలో ప్రభాస్​.. తనని తాను పరిచయం చేసుకుంటూ కమల్​పై ప్రశంసలు కురిపించారు.

"కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఆయన పక్కన కూర్చోవడమే నా అదృష్టం. ఆయనకు నేనెవరో తెలియదేమో. ఐ యామ్ ప్రభాస్ సర్.(సరదాగా) మా జనరేషనే కాదు.. ఇంకో 10 జనరేషన్లకు కమల్ హాసన్ అవసరం. ఆయన అందరికీ స్ఫూర్తి. కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంతో అవసరమో తెలియదు గానీ.. ఇండియాకు ఆయన సినిమాలు చాలా అవసరం. ఆయన గొప్ప నటుడని నా అభిప్రాయం. నేను విశ్వరూపం చూశాను. అదో హాలీవుడ్​ చిత్రంలా అనిపించింది. మొదటి 20 నిమిషాలు ఎక్స్​టార్డనరీ. సూపర్​. సెకండాఫ్​ హాలీవుడ్​లా ఉంది" అని ప్రభాస్ అన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Kamal haasan project k : అలా ఒకప్పుడు.. కమల్ హాసన్​కు తనని తాను పరిచయం చేసుకున్న ప్రభాస్​.. ఇప్పుడు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ వీడియోను చూస‍్తున్న డార్లింగ్ అభిమానులు.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అంటూ ప్రభాస్​పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prabhas Project K : ఇక ప్రాజెక్ట్​ కె విషయానికొస్తే.. ఇందులో కమల్‌ హాసన్​ విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలో రిలీజ్​ కానుంది. మునుపెన్నడు చూడని భారీ చిత్రంగా, అతిపెద్ద సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం వరకు చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :

ప్రభాస్ 'ప్రాజెక్ట్​- K'లో కమల్​ హాసన్.. త్వరలోనే షూటింగ్​!

విల్లాను అద్దెకు ఇస్తున్న ప్రభాస్.. రెంట్ ఎంతో తెలిస్తే అమ్మో అనాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details