Prabhas Kalki 2898 Ad Release Date : భారతీయ చిత్రసీమలో అత్యంత ఖరీదైన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి ఏడి 2898'. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మే 9న మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. ఈ దిశగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ విడుదల తేదీని సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 12న ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది.
అయితే ఆ రోజే ఎందుకు? ప్రత్యేకత ఏమిటి? అంటే - ఈ డేట్ వెనుక వైజయంతి మూవీస్‌కు ఓ సెంటిమెంట్ దాగి ఉంది. 1990లో ఇదే డేట్‌కు వైజయంతి నిర్మాణ సంస్థలో చిరంజీవి, శ్రీదేవి జంటగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రిలీజై ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. చిరంజీవి కెరీర్ బెస్ట్ టాప్ 5 మూవీస్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది.