Prabhas Hindi Dubbed Movies : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ త్వరలో 'సలార్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాదిగా వరుస సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 'ఆదిపురుష్' ఇప్పటికే విడుదల కాగా.. 'సలార్'తో పాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం కానున్నాయి. అయితే 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా పేరొందిన ప్రభాస్.. ఆ తర్వాత టాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇక 'బాహబలి- కన్‌క్లూజన్' తర్వాత ప్రభాస్ లీడ్ రోల్లో వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ టాక్ అందుకోలేకపోయింది.
Prabhas Bollywood Market : భారీ అంచనాలతో తెరకెక్కిన 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు అభిమానులను అలరించలేకపోయాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'సాహో'తో పాటు ఓ మంచి స్టోరీలైన్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్'.. టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా బీటౌన్‌లో ప్రభాస్ సినిమాలు దూసుకెళ్తుంటాయి. బాలీవుడ్లో మంచి కలెక్షన్లు సంపాదించిపెట్టి అక్కడి ఫ్యాన్స్‌కు ప్రభాస్ అంతే ఎంత ఇష్టమో తెలిపేలా థియేటర్లలో సందడి చేస్తాయి. తెలుగునాట ఆశించిన స్థాయిలో టాక్ అందుకోని మూవీస్ కూడా బాలీవుడ్లో కాసుల వర్షం కురిపించడం గమనార్హం.