తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాధేశ్యామ్‌'​ దర్శకుడికి ప్రభాస్​ మరో ఛాన్స్​.. అతడిపై నమ్మకంతోనే.. - యూవీ క్రియేషన్స్​లో డైరెక్టర్​ రాధా కృష్ణ మూవీ

ఒక పెద్ద హీరోతో సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోతే ఆ తర్వాతి ప్రాజెక్ట్​ను స్టార్ట్​ చేయడం దర్శకులకు సవాల్​ లాంటిది. ఒక స్టార్‌ హీరోతో సినిమా చేశాక.. మరో కథానాయకుడితో పనిచేసేందుకు ఎంతగానో ఆలోచిస్తారు. అలాగే అలాంటి డైరెక్టర్​కు కాల్షీట్లు ఇచ్చేందుకు ఇతర హీరోలు కూడా వెనక్కితగ్గుతుంటారు. కానీ దీనికి భిన్నంగా.. అలాంటి డైరెక్టర్​కు మరో ఛాన్స్ ఇచ్చారు మన డార్లింగ్​ ప్రభాస్.

radhe shyam director radha krishna
radhe shyam director radha krishna

By

Published : Feb 11, 2023, 4:16 PM IST

Updated : Feb 11, 2023, 4:26 PM IST

అగ్రకథానాయకులతో సినిమా తీసి.. అది బాక్సాఫీస్​ వద్ద నిరాశపరిచిందంటే.. ఆ దర్శకుల బాధ మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఓ స్టార్‌ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్‌ హీరోలతో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇక పెద్ద హీరోలు కూడా అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయి ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దర్శకుడు రాధాకృష్ణ. 'జిల్‌' సినిమాతో ఆయన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. తన రెండో ప్రాజెక్టుగా పాన్​ ఇండియా స్టార్​​ ప్రభాస్‌తో 'రాధేశ్యామ్‌' తీశారు. పాన్​ ఇండియా లెవెల్​లో రికార్డు సృష్టిస్తుంది అనుకున్న ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.

కానీ, మన డార్లింగ్​ మాత్రం ఇంకా ఈ డైరెక్టర్​పై నమ్మకంతోనే ఉన్నాడట. అందుకే తన సొంత బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్‌లో రాధాకృష్ణకు మరో సినిమా ఛాన్స్​ ఇచ్చారట. ప్రభాస్​ స్నేహితుడు హీరో గోపిచంద్​తో ఓ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా స్టార్ట్‌ అయ్యాయట. ఇక అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేదే ఆలస్యం అని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా, గోపిచంద్‌ ప్రస్తుతం 'రామబాణం' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్​ ప్లాన్​ చేస్తోందట. మరో వైపు, ప్రభాస్..​ 'ఆదిపురుష్'​,'సలార్'​, 'ప్రాజెక్ట్​ కె' సినిమాలతో బిజీగా ఉన్నారు.

Last Updated : Feb 11, 2023, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details