తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కృతిసనన్​తో లవ్​.. ప్రభాస్​ నిజం చెప్పేశారుగా! - బాలకృష్ణ ప్రభాస్​

కృతిసనన్​లో లవ్​లో ఉన్నట్లు వస్తున్న ప్రచారంపై స్పందించారు పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​. అలానే తాను నటించిన పలు చిత్రాల గురించి కూడా మాట్లాడారు.

Unstoppable Prabhas
కృతిసనన్​తో లవ్​.. ప్రభాస్​ నిజం చెప్పేశారుగా!

By

Published : Dec 30, 2022, 10:59 AM IST

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​-హీరోయిన్​ కృతిసనన్​ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా వాటిపై స్పందించారు ప్రభాస్​. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు. "నువ్వు ఎంతోమంది హీరోయిన్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నావు. కానీ, రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు?" అని అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్య ప్రశ్నించగా.. "అది పాత వార్త‌‌. అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని మేడమ్‌(కృతిసనన్‌) ఇప్పటికే చెప్పేసింది కదా. ఆ వార్తల్లో నిజం లేదు. మీకు తెలియంది ఏముంది? ఏమీ లేకపోయినా అనవసరంగా ఇలాంటి గోల చేస్తున్నారు" అని ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చారు.

తాను నటించిన పలు చిత్రాల గురించి కూడా మాట్లాడారు ప్రభాస్‌. "నా కెరీర్‌లో మొదటి విజయాన్ని అందించిన చిత్రం 'వర్షం'. ఆ సినిమా చేస్తున్నప్పుడే అది హిట్‌ అవుతుందని టీమ్‌ మొత్తం విశ్వసించాం. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌‌' షూట్‌ ఆరు నెలల్లోనే అయిపోయింది. అయితే క్లైమాక్స్‌లో ఎమోషన్స్‌ సరిగ్గా రాలేదనే ఉద్దేశంతో మరో మూడు నెలలపాటు రీషూట్‌ చేశాం. నిర్మాత దిల్‌రాజు అందుకు ఓకే అన్నారు. అలా, సినిమా కాస్త వాయిదా పడింది. 'ఛత్రపతి' చేస్తున్నప్పుడు షూట్‌ మొదలైన నాలుగు రోజులకే రాజమౌళి గొప్ప మనిషి అని అర్థమైంది. ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆ సినిమా విరామ సన్నివేశాలు షూట్‌ చేసేటప్పుడు సెట్‌ మొత్తం జనాలు. వాళ్లందర్నీ చూసి డైలాగ్‌ చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. అదే విషయాన్ని జక్కన్నతో చెప్పి ఈ సీన్‌ వరకూ మూకీగా యాక్ట్‌ చేశాను. అక్కడ ఉన్న వాళ్లందరూ రిహార్సల్స్‌ అనుకున్నారు. 'బాహుబలి' లాంటి సినిమాలో నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు." అని వివరించారు.

ఇదీ చూడండి:ఒకే వేదికపై చిరు-బాలయ్య​​​.. హోస్ట్​గా మంచు విష్ణు.. ఫ్యాన్స్​ సర్​ప్రైజ్​!

ABOUT THE AUTHOR

...view details