Prabhas Maruti film: వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు. దీపిక పదుకొణె కథానాయిక. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వ్యయంతో వైజయంతీ మూవీస్ దీన్ని తెరకెక్కిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ దృష్టి అంతా 'ప్రాజెక్ట్-కె'పైనే పెట్టినట్లు తెలుస్తోంది. మే నెలాఖరు వరకూ ఈ సినిమా షూటింగ్‌లోనే పాల్గొననున్న ప్రభాస్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్' సెట్‌లో అడుగు పెడతారు. వీలైనంత త్వరగా 'సలార్' పూర్తి చేసి, మళ్లీ 'ప్రాజెక్ట్ కె'చిత్రీకరణలో పాల్గొనాలని భావిస్తున్నారట.
ప్రభాస్ దృష్టంతా ఆ సినిమాపైనే.. మారుతీ మూవీ మరింత ఆలస్యం? - ప్రభాస్ లేటెస్ట్ న్యూస్
Prabhas Maruti film: రెబల్‌స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం తన దృష్టి అంతా 'ప్రాజెక్ట్ కె'పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా దర్శకుడు మారుతీతో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
సెట్స్, ఇతర సాంకేతిక కారణాలతో ఆలస్యమైతే తప్ప 'ప్రాజెక్ట్ కె'కే ఎక్కువ డేట్స్ ఇవ్వాలని ప్రభాస్ అనుకుంటున్నారట. దీంతో మారుతీ దర్శకత్వంలో చేసే సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. వరుసగా పెద్ద సినిమాలను చేస్తున్న ప్రభాస్, మారుతీ చెప్పిన కథకు ఇటీవలే ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ, 'ప్రాజెక్ట్-కె'కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభాస్ దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని టాక్.
ఇదీ చూడండి: ప్రభాస్.. నన్ను చెడగొట్టినందుకు థ్యాంక్స్: దిశా పటానీ