Unstoppable NBK Prabhas: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'అన్‌స్టాపబుల్-2' షో మొదటి సీజన్ మాదిరిగానే దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ప్రసారమైన 5 ఎపిసోడ్లు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. వాటన్నింటినీ మించి ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ రాబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' ఎపిసోడ్ 6లో గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు. ఆయనతో బాలయ్య ముచ్చట్లు పెట్టి వినోదాన్ని పంచబోతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఆహా ఒక చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేసింది. అయితే, ఇది ప్రకటనకు సంబంధించిన ప్రోమో మాత్రమే. ఎపిసోడ్ ప్రోమో కాదు.
ప్రభాస్ పాల్గొనే ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం మొదలైందని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ను ఒక ప్రశ్న అభిమానుల తరఫు నుంచి బాలయ్యతో అడిగించేందుకు ఆహా సిద్ధమైంది. ఆ ప్రశ్న ఏంటో చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్విట్టర్ ద్వారా ఆఫర్ ఇచ్చింది. ప్రశ్న క్రేజీగా ఉంటే బాలయ్య కచ్చితంగా అడుగుతారని పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు కామెంట్ల సెక్షన్‌లో చెలరేగిపోతున్నారు. తమకు తోచిన క్రేజీ ప్రశ్నలను సంధిస్తున్నారు. అయితే, వీటిలో ఒక క్రేజీ ప్రశ్న చాలా మంది అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ ప్రశ్నను అడగాలని ఆహాను రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేంటంటే..