Prabhas Fans Netflix: సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతుంటోంది. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్‌ను అవమానించేలా పోస్ట్‌లు పెడితే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఇప్పుడు ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో నెట్‌ఫ్లిక్స్ సంస్థను ఆడేసుకుంటున్నారు.
ప్రభాస్ 'సాహో' యాక్షన్ సీన్‌పై నెట్‌ఫ్లిక్స్ సెటైర్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం.. మూడేళ్ల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తాజాగా ఆ మూవీలోని ఓ సీన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెట్‌ప్లిక్స్.. ఇదేం యాక్షన్ అంటూ ఎద్దేవా చేసింది. దీంతో డార్లింగ్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
అసలేం జరిగిందంటే.. 'సాహో' సినిమాలో ప్రభాస్ కొండ మీద నుంచి లోయలోకి దూకే షాట్ ఒకటి ఉంటుంది. దాన్ని ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. 'ఇదేం యాక్షన్..?' అంటూ వెటకారంగా ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్ ఇండోనేసియా విభాగం. ఇండోనేసియా భాషలోనే ఆ క్యాప్షన్ పెట్టారు. దీన్ని గూగుల్‌లో అనువదించి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. 'సాహో' సినిమాను, ప్రభాస్‌ను కించపరుస్తున్నట్లుగా ఉండడంతో నెట్‌ఫ్లిక్స్‌పై యుద్ధం ప్రకటించారు!.
'అన్‌సబ్‌స్క్రైబ్ నెట్‌ఫ్లిక్స్' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్నట్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది నెట్‌ఫ్లిక్స్‌కు పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోను నెట్‌ఫ్లిక్స్ టచ్ చేయకుండా ఉండాల్సిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 'సాహో' సినిమా నిరాశపరిచినప్పటికీ.. భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. యాక్షన్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారు.