Salaar Movie Update: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- రెబల్‌స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న 'డార్లింగ్' అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ అభిమాని ఒకరు 'సలార్' అప్‌డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు రాసిన లెటర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'సినిమా మొదలై ఇన్ని నెలలో అవుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటా' అని ఆ లేఖలో ఉంది. అయితే ఈ లెటర్ రాసిన అభిమాని పేరు.. తదితర వివారాలు మాత్రం అందులో ఆ లేఖలో లేవు.
'సలార్ అప్డేట్ ఎప్పుడు?' సూసైడ్ నోట్లో ప్రభాస్ అభిమాని! - సలార్ సినిమా వార్తలు
Salaar Movie Update: ప్రభాస్ అభిమాని రాసిన ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సలార్' అప్‌డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని ఆ అభిమాని అందులో పేర్కొనడం గమనార్హం.
ప్రభాస్
Last Updated : May 10, 2022, 9:54 PM IST