తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​-హరీశ్​ సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ డైరెక్టర్​ - దర్శకుడు దశరథ్​ పవన్​ కల్యాణ్ సినిమా

పవన్​కల్యాణ్​ హరీశ్ శంకర్ సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ డైరెక్టర్​ దిగబోతున్నారు. ఆ వివరాలు..

Pawankalyan harish shankar movie  update
పవన్​-హరీశ్​ సినిమా కోసం రంగంలోకి ప్రభాస్ డైరెక్టర్​

By

Published : Dec 9, 2022, 5:42 PM IST

పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ అనే సినిమా తెరకెక్కనుంది. అయితే, ఇప్పటివరకూ ఈ మూవీ గురించి అటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, ఇటు పవన్‌కల్యాణ్‌, ఆఖరికి చిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా ఎలాంటి అప్డేట్స్​ ఇవ్వలేదు. తాజాగా 'లవ్‌ యు రామ్‌' చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తన సినిమా గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌తో తీయబోయే సినిమా కోసం సీనియర్‌ దర్శకుడు దశరథ్‌ పనిచేస్తున్నట్లు చెప్పారు.

"నేను దుర్గా ఆర్ట్స్‌లో అసిస్టెంట్‌గా చేరినప్పుడు దశరథ్‌ అన్నయ్య సంతోషంతో హిట్‌ కొట్టారు. ఆ తర్వాత నేను దిల్‌రాజ్‌ నిర్మాణ సంస్థకు వెళ్తున్న సమయంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్ తో మరో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ఆయన డైరెక్షన్‌, రైటింగ్‌ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పవన్‌తో నేను చేస్తున్న సినిమాకు స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అందుకు దశరథ్‌ అన్నయ్యకు ధన్యవాదాలు. లవ్‌ యూ రామ్‌ నేను చూశాను. చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని హరీశ్‌ శంకర్‌ తెలిపారు. అయితే, దశరథ్‌ భవదీయుడు భగత్‌సింగ్ కోసం పనిచేస్తున్నారా? లేదా ఏదైనా రీమేక్‌పై పనిచేస్తున్నారా? అన్న విషయాన్ని మాత్రం హరీశ్‌ శంకర్‌ చెప్పలేదు.

మరోవైపు పవన్‌-హరీశ్‌ కాంబినేషన్‌లో రానున్నది తమిళ చిత్రం తెరి రీమేక్‌ అని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో హరీష్‌శంకర్‌ తన సినిమా గురించి ట్వీట్‌ చేయగానే, రీమేక్‌ వద్దు అంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రతిస్పందించారు. 'మాకు తెరి రీమేక్‌ వద్దు' అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌ కూడా అయ్యింది. పవన్‌కల్యాణ్‌ కోసం హరీష్‌ శంకర్‌ కొత్త కథనే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని ప్రారంభించనున్నట్టు తెలిసింది.

ఇదీ చూడండి:Tollywood Masti స్టార్ హీరోల కొత్త ఫొటోస్​ ఫుల్​ ట్రెండింగ్​ ఓ లుక్కేయండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details