తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాధేశ్యామ్'​ రిజల్ట్​పై ప్రభాస్​ కామెంట్స్​.. ఆ లేడీ డైరెక్టర్​తో రోషన్​ మూవీ! - రోషన్​ నందిని రెడ్డి

'రాధేశ్యామ్'​ సినిమా మిశ్రమ స్పందనలను అందుకోవడంపై హీరో ప్రభాస్​ స్పందించారు. దీంతో పాటే సీనియర్​ హీరో శ్రీకాంత్​ తనయుడు రోషన్​ మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

prabhas radheshyam
ప్రభాస్​ రాధేశ్యామ్​

By

Published : Apr 20, 2022, 9:15 AM IST

Prabhas on Radheshyam movie: 'బాహుబలి' సిరీస్​తో వరుసగా రెండు బ్లాక్​ బస్టర్​ హిట్స్​ అందుకున్నారు ప్రభాస్​. ఆ తర్వాత అదే జోరుతో వరుసగా పాన్​ ఇండియా ప్రాజెక్ట్స్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్'​తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ మిశ్రమ స్పందనలను అందుకుంది. తాజాగా దీనిపై ప్రభాస్​ స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి.

"బాహుబలి లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే నటుడిగా కొత్తదనం చూడలేను. పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక. అవి చిన్న బడ్జెట్​ చిత్రాలైనా నాకిష్టమే. ఇక రాధేశ్యామ్​ విషయానికొస్తే.. స్క్రిప్ట్​లో ఏదైనా లోపం ఉండొచ్చు. లేకపోతే ప్రేమకథల్లో నన్ను చూడటానికి ఇష్టపడకపోవచ్చు. అయితే కరోనా కారణంగా టెలివిజన్ లేదా ఇతర ప్లాట్​ఫామ్​లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అలానే 'రాధేశ్యామ్'​ను కూడా టెలివిజన్​పై ఫ్యామిలీ అంతా కూర్చొని ఆస్వాదిస్తారని అనుకుంటున్నా." అని ప్రభాస్​ అన్నట్లు ఆ కథనాల్లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్..​ 'సలార్'​, 'ఆదిపురుష్​', 'స్పిరిట్'​ సహా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Roshan new movie: ఇటీవలే 'పెళ్లిసందడి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్​ సీనియర్​ హీరో శ్రీకాంత్​ తనయుడు రోషన్​.. తన కొత్త సినిమాను వైజయంతి మూవీస్​ సమర్పణలో స్పప్న సినిమాస్​ బ్యానర్​లో చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రోషన్​ మరో సినిమాను లైన్​లో పెట్టినట్లు తెలుస్తోంది. 'అలా మొదలైంది', 'ఓ బేబీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఇదీ చూడండి: బాలయ్య-అనిల్​ రావిపూడి సినిమా సెట్స్​పైకి అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details