లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్ హీరోగా, అమరేంద్ర బాహుబలిగా ఇలా పలు పాత్రలతో వైవిధ్యాన్ని కనబరిచాడు ప్రభాస్. 'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ.వందకోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్. అయితే ఆయన తన అక్టోబర్ 23న తన 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా చేసుకునేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. అయితే మన డార్లింగ్ మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఆయన అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఏంటంటే.. ఆయన ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ విషయాన్ని సినీవర్గాలు తెలిపాయి.
ఇటీవలే ప్రభాస్ పెద్దనాన్న, సినీ దిగ్గజం.. కృష్ణం రాజు మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కారణంగానే ప్రభాస్ ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోరని సినీ వర్గాలు వెల్లడించాయి.