Prabhas Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆలయ ట్రస్టుతోపాటు అధికారులు కూడా పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు దేశంలోని పలువురు పండితులకు, సెలబ్రెటీలకు ఇప్పటికే అహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సంజయ్‌లీలా బన్సాలీ, మోహన్ లాల్, ధనుష్, రిషభ్ శెట్టికి ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. ఇక తాజాగా మరికొంత మంది సినీ నటులను ట్రస్టు ఆహ్వానించింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సన్నీ దేవోల్, టైగర్ జాకీష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ యశ్ ఉన్నారు.
Ayodhya Invitation to Cricketers : సినీ నటులే కాకుండా క్రికెటర్లను కూడా ట్రస్టు ఆహ్వానించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందింది. వీరితోపాటు ప్రముఖ టీవీ సీరియల్ రామాయణంలో సీతారాముల పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిక్లియా, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా సహా దేశంలోని న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.