Prabhas Anushka Promotions : టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో నవీన్.. పలు ప్రదేశాలకు తిరిగి సినిమాను ప్రమోట్ చేస్తుండగా.. హీరోయిన్ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. ఆయన చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో అనుష్క ..తనకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో భాగంగా మంగుళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తెలిపారు. అలా #MSMPRecipeChallenge ను నెట్టింట స్టార్ట్ చేశారు.
Anushka Neer Dosa Recipie : "నేను ఈ సినిమాలో చెఫ్ పాత్రలో కనిపించనున్నాను.. అందుకే నాకు ఇష్టమైన వంటకాలను మీతో పంచుకుంటున్నాను. దీంతో ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. అందులో భాగంగా మొదట ఈ ఛాలెంజ్‌లో ప్రభాస్ పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి.. అలాగే అతిథులను భోజనాలతో ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రభాస్. ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి" అంటూ ప్రభాస్‌ను ట్యాగ్ చేశారు అనుష్క.
Prabhas Latest Instagram Post :ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన డార్లింగ్.. వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్ రెసిపీని పోస్ట్ చేశారు. రొయ్యల పులావ్ అంటే ఇష్టమంటూ తెలిపిన ఆయన..దానికి సంబంధించిన తయారీ విధానాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను రామ్ చరణ్‌కు విసురుతున్నట్లు చెప్పారు.