తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆలస్యమవ్వనున్న 'ప్రాజెక్ట్​ కె' షూటింగ్​..రీజన్​ అదేనా?

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో రూపొందుతున్న 'ప్రాజెక్ట్​ కె' రిలీజ్​ డేట్​లో మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే.

project k
project k

By

Published : May 10, 2023, 6:23 PM IST

Updated : May 10, 2023, 7:25 PM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ లీడ్​ రోల్​లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్​ కె'. దీపికా పదుకుణె, అమితాబ్​ బచ్చన్​ లాంటి స్టార్స్​ నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్​ సైతం అప్పట్లోనే రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ షూటింగ్​ ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని సిని వర్గాల టాక్​. దీనికి కారణం ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్​ నటుడు అమితాబ్​ గాయమని టాక్​.

ఇటీవలే ఇదే సెట్స్​లో సీనియర్ యాక్టర్​ అమితాబ్​ బచ్చన్​కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆయన చికిత్స తీసుకుని విశ్రాంతిలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సినిమాలో ఆయన షెడ్యూల్​ కంప్లీట్​ అయ్యేందుకు కాస్త సమయం పడేలా ఉందని టాక్​. దీంతో ​ 2024 సంక్రాంతి కానుకగా రిలీజవ్వనున్న ఈ సినిమా ఇక ఆ టైమ్​కు రెడీ అవ్వదేమో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రొడక్షన్​ యూనిట్​కు సన్నిహితుల్లో ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అమితాబ్​ను ఎటువంటి ఒత్తిడికి చేయమని.. ఆయన కోలుకునేందుకు కావాల్సిన సమయాన్ని ఇస్తామని పేర్కొన్నారు. "బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్​తో పాటు నిర్మాతలు కూడా ఆయన విషయంలో ఎటువంటి హడావిడిలో లేరు. వారు ఆయన్ను షూటింగ్ పునఃప్రారంభించమని ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. ఆయన కోలుకుని తిరిగి వచ్చేంతవరకు వారు వేచి ఉండాలనుకుంటున్నారు. దానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి. అయితే, 'ప్రాజెక్ట్ కె' ను అనుకున్న ప్రకారం జనవరి 2024లో విడుదల చేయడం అసంభవం అనిపిస్తుంది". అని ప్రొడక్షన్​ యూనిట్​ సన్నిహిత వ్యక్తి పేర్కొన్నారు.

గతంలో సినిమాలోని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్​ గాయపడ్డారు. మార్చి 4న జరిగిన ఈ ఘటనలో ఆయన కుడి పక్కటెముక విరిగడంతో పాటు కొన్ని కండరాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ముంబయిలోని తన స్వగృహానికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్​ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'ప్రాజెక్ట్‌ కె' కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Last Updated : May 10, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details