రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని.. వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున, 70 దేశాల్లో రిలీజ్ చేశారు. అయితే గతంలో టీజర్.. వీఎఫ్‌ఎక్స్ విషయంలో, రావణాసురి లుక్‌లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని, ట్రైలర్‌ను జాగ్రత్తగా కట్ చేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టీజర్-ట్రైలర్ మధ్య తేడాను గమనిస్తే.. గ్రాఫిక్స్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. టీజర్‌తో పోలిస్తే.. ఈ తాజా ప్రచార చిత్రంలోని గ్రాఫిక్స్ చాలా బాగున్నాయనే చెప్పాలి. అభిమానులు దీన్ని పండగ చేసుకుంటున్నారు. సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. అయితే, అక్కడక్కడా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో అవసరానికి మించి వీఎఫ్‌ఎక్స్ షాట్స్ వాడేసినట్లు అనిపిస్తోంది. ఇంకా కొన్ని సన్నివేశాలను మెరుగుపరుస్తే ఇంకా బాగుంటుంది. ఒక చోట ప్రభాస్ లుక్ నేచురల్‌గా ఉంటే మరొక చోట మోషన్ క్యాప్చర్ బొమ్మలాగానే కనిపిస్తోంది. బహుశా అవన్నీ రీషూట్ చేయడం కూడా కష్టం కావడం వల్ల వదిలేసి ఉండొచ్చు. అయితే వీటితో పాటు మనం ఇంకొన్ని గమనించొచ్చు. అవేంటంటే..
రావణుడికి నో స్పేస్.. రామాయణ ఘట్టంలోని కీలకమైన రావణాసుడు సీతన అపహరించడం, శబరి ఎంగిలి పళ్లను రాముడు తినడం, రామసేతు నిర్మాణం, హనుమంతుని పోరాటం, లంకా దహణం, రావణ సంహారం, లాంటి కీలకమైన సన్నివేశాలకు మాత్రమే ప్రచార చిత్రంలో చోటిచ్చారు. దాదాపుగా అందరికీ తెలిసిన కథే కాబట్టి ఎలాంటి సస్పెన్స్ లేకుండా ట్రైలర్‌ను ముగించారు. అయితే ఈ ప్రచార చిత్రంలో రావణుడికి పెద్దగా స్పేస్ ఇవ్వలేదు. ఒకటే బాణం, ఒకే మాట అనే సిద్ధాంతాన్ని ఈ ప్రచార చిత్రంలో చూపించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్ర పోషించారు. వాస్తవానికి ప్రారంభంలో సైఫ్ అలీ ఖాన్.. రావణుడి పాత్రకు సెట్ కాలేదంటూ తీవ్రంగా విమర్శలు వచ్చాయి. రావణాసుడి లుక్, వాహనం.. ఏదీ బాలేదంటూ సోషల్‌మీడియాలో ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడా లంకేశుడి రూపాన్ని కూడా ఎలా తీర్చిదిద్దారో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఈ ప్రచార చిత్రంలో రావణ బ్రహ్మను పాత్ర కేవలం రెండు మూడు సెకన్లు మాత్రమే చూపించారు. చివర్లో శివుడి కృప కోసం రావణాసురుడి ఘోర తపస్సును చూపించారు. అది కూడా కేవలం కళ్లు, వెనక భాగం నుంచే చూపించారు. దీంతో రావణాసుడి లుక్‌ను ఎలా తీర్చిదిద్దారనే విషయంపై మరింత క్యూరియాసిటీ పెరిగిందనే చెప్పాలి.
సేమ్ ఫీలింగ్.. 'బాహుబలి 2'లో 'ఏదీ మరణం.. మన గుండె ధైర్యం కన్నా శత్తు బలగం పెద్దది అనుకోవడం మరణం.. నాతో వచ్చేదెవరు. చచ్చేదెవరు' అంటూ ప్రభాస్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడా తాజా ఆదిపురుష్ ట్రైలర్లోనూ ఓ భారీ డైలాగ్ ఉంది. 'నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ వింటుంటే.. సేమ్ బాహుబలిలో చెప్పిన డైలాగ్ ఫీల్ కలుగుతుందనే చెప్పాలి.