తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

August ott release movies telugu : 'ఆదిపురుష్' టు 'బేబీ'.. ఆగస్టులోనే ఓటీటీలోకి!.. ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే? - August ott release movies telugu

Augutst ott release telugu movies : రీసెంట్​గా థియేటర్లలో రిలీజైన కొన్ని చిత్రాలు ఓటీటీ విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో బేబీ, ఆదిపురుష్ హిడింబ, భాగ్​సాలే వంటి చిత్రాలు ఉన్నాయి. ఆ వివరాలు..

August ott release movies telugu
August ott release movies telugu

By

Published : Aug 1, 2023, 1:37 PM IST

August ott release movies telugu : గత కొద్ది కాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు ఎక్కువ మొత్తంలో సినిమాలేమీ సూపర్​ హిట్ కాలేదు. 'దసరా', 'విరూపాక్ష', 'సామజవరగమన', 'బేబీ' చిత్రాలు మాత్రమే మంచి సెన్సేషన్ హిట్​ను సాధించాయి. ప్రస్తుతం 'బ్రో' చిత్రం మంచి వసూళ్లను అందుకుంటూ రన్ అవుతోంది. అయితే థియేటర్లలో రిలీజైన ఏ సినిమా అయినా.. ఓటీటీలోకి వస్తాయన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మధ్యలో రీసెంట్​గా విడుదలైన కొన్ని ఆడియెన్స్​ను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? వంటి వివరాలను తెలుసుకుందాం..

bhaag saale ott release date : సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు శ్రీసింహా కోడూరి. 'మత్తు వదలరా', 'తెల్లవారితే గురువారం' సినిమాలతో హిట్ అందుకున్న ఆతడు.. ఇటీవలే 'భాగ్‌ సాలే'తో మెప్పించలేకపోయాడు. ప్రణీత్‌ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్​ఫ్లిక్స్​లో ఆగస్ట్​ 7నుంచి అందుబాటులో ఉండొచ్చని అంటున్నారు.

hidimba ott release date : 'జీనియస్‌', 'రాజుగారి గది 2', 'రాజుగారి గది 3' సహా మరిన్ని సినిమాలతో మెప్పించిన యాంకర్ ఓంకార్ బ్రదర్ నటుడు అశ్విన్‌బాబు. ఇటీవలే 'హిడింబ' సినిమాతో ఆడియెన్స్​ ముందుకు వచ్చి సక్సెస్​ను అందుకున్నారు. అనిల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే(ఈ నెల) ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

prabhas adipurush ott release date : రామాయణం ఆధారంగా హై టెక్నాలజీతో దర్శకుడు ఓంరౌత్‌ రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాముడిగా నటించిన ఈ చిత్రంలో సీత పాత్రలో హీరోయిన్‌ కృతిసనన్‌ నటించి మెప్పించింది. భారీ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం విమర్శలను అందుకుని డిజాస్టర్​గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు రెండు లేదా మూడో వారంలో రావొచ్చని అంటున్నారు.

Baby movie ott release date : ఇక రీసెంట్​గా దాదాపు రూ.5కోట్ల బడ్జెట్​తో చిన్న సినిమాగా వచ్చిన సెన్సేషనల్ హిట్ అందుకున్న చిత్రం బేబీ. దాదాపు 70కోట్లకు పైగా వసూళ్లను అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లో సక్సెస్​ఫుల్​గా నడుస్తోంది. ఈ సినిమా ఆహాలో ఆగస్ట్​ 18 నుంచి స్ట్రీమింగ్​ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఇప్పటికే రిలీజై డిజాస్టర్లుగా నిలిచిన నిఖిల్ 'స్పై', నాగశౌర్య 'రంగబలి' .. కూడా అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చూడండి :

August tollywood movie releases 2023 : ఆగస్ట్ సినీ జాతర.. ఒకేసారి 25 సినిమాలు.. వారానికో మెగా హీరో సందడి

Heroine Mrunal thakur Birthday : పాపం మృణాల్ ఠాకూర్.. అంత అవమానం జరిగిందా?..

ABOUT THE AUTHOR

...view details