తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'శాకుంతలం'తో ప్రభాస్​ 'ఆదిపురుష్' టీమ్​లో భయం! - ఆదిపురుష్​ వీఎఫ్​ ఎక్స్​ ట్రోల్స్​

సమంత 'శాకుంతలం' రిజల్ట్​.. ప్రభాస్ 'ఆదిపురుష్​'పై ఎఫెక్ట్​ పడింది! ఆ వివరాలు..

Sakuntalam adipurush
'శాకుంతలం' ఫలితం.. 'ఆదిపురుష్' టీమ్​లో భయం!

By

Published : Apr 18, 2023, 6:04 PM IST

చారిత్రక నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్​, గ్రాఫిక్స్​ ఉంటే చాలు ఆడియెన్స్​ థియేటర్లకు వచ్చేస్తారనుకుంటే పొరపాటే! ​ అసలే సినిమాను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఎన్ని హంగులు దిద్దినా కంటెంట్ పక్కాగా ఉండాల్సిందే. కథలో డ్రామా, పాత్రల మధ్య ఎమోషనల్​​ కనెక్షన్స్ ఉండాల్సిందే! లేదంటే అంటే. తాజాగా విడుదలైన 'శాకుంతలమే' దినికి ఉదాహరణ. రూ.50 కోట్లకు పైగా బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. కథ, కథనం, ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్​ కనెక్ట్​ లేకపోవడం, పాత్రలు సహజంగా అనిపించకపోవడం, పేలవ వీఎఫ్​ఎక్స్, గ్రాఫిక్స్​, సెట్టింగ్స్​​.. ఇలా పలు అంశాలు.. సినిమాకు నెగటివ్​ టాక్ తెచ్చిపెట్టాయి.

అయితే ఇదంతా ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్'​ టీమ్​ను, వారి అభిమానులను బాగా కంగారు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 'శాకుంతలం'లో ఉన్న మైనస్​లే 'ఆదిపురుష్'లో కూడా ఉన్నాయనే ఫీలింగ్ ఇప్పటికే ఆడియెన్స్​లో ఉంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్​, టీజర్​, పోస్టర్స్​ ఎవర్నీ ఆకట్టుకోలేకపోయాయి. సోషల్​మీడియాలో ఫుల్​ ట్రోల్స్​కు గురయ్యాయి. దీంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేసిన మూవీటీమ్​.. విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాలపై మళ్లీ పూర్తి ఫోకస్​ పెట్టి వర్క్ చేస్తోంది. కానీ ఈ వర్క్ చేయడం మొదలు పెట్టాక కూడా అది రిలీజ్ చేసిన పోస్టర్స్​.. మళ్లీ ఆడియెన్స్​ను నిరాశపెట్టాయి.

సరే ఈ గ్రాఫిక్స్ విషయంలో ఏంత మాత్రం మార్పులు చేసినా.. కాస్త అయితే చేయగలరు కానీ.. మొత్తంగా సినిమా లుక్​ను మార్చడం కష్టమే కదా?.. మరి ఏం చేస్తారో కానీ.. ఔట్ పుట్​పై ప్రస్తుతం అందరికీ డౌటే ఉంది. ముఖ్యం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. అలానే ఆదిపురుష్ టీమ్​ కూడా బయటకు చెప్పుకోలేకపోయినా ఆ భయం వారిని కూడా వెంటాడుతుందనే అనిపిస్తోంది. ఏదేమైనా.. చారిత్రక కథలను స్క్రీన్​పై సరిగ్గా ప్రెజెంట్ చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. కొంచెం అటు ఇటు అయితే మాత్రం దారుణ ఫలితాలు వస్తాయి. చూడాలి మరి 'ఆదిపురుష్' సినిమా ఏం చేస్తుందో..

ఆదిపురుష్ సినిమా వివరాల విషయానికొస్తే.. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్​ సీతగా నటిస్తోంది. దర్శకుడు ఓం రౌత్​ దీన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ కనిపించనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకొనే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పాన్​ ఇండియా స్థాయిలో జూన్ 16న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో రూపొందిస్తున్నారని వినిపిస్తోంది.

ఇదీ చూడండి:'శాకుంతలం' రిజల్ట్​పై సామ్​ రియాక్షన్​.. ఏమందంటే?

ABOUT THE AUTHOR

...view details