Adipurush pre release bussiness : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణం ఆధారంగా ఇది రూపొందిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో బుక్కింగ్స్ మొదలై జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో తెలుగు, హిందీ ఆడియెన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగిందని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఏరియా వైడ్‌గా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
- నైజాంలో - 50 కోట్లు
- సీడెడ్- 17.60 కోట్లు
- ఉత్తరాంధ్ర - 14.50 కోట్లు
- తూర్పు గోదావరి - 8.80 కోట్లు
- పశ్చిమ గోదావరి - 7.20 కోట్లు
- గుంటూరు - 8.60 కోట్లు
- కృష్ణా జిల్లా - 8.50 కోట్లు
- నెల్లూరు - 4.80 కోట్లు
మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 120 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే రూ. 121 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఈ కలెక్షన్స్ మొదటివారంలోనే వచ్చేస్తాయని అభిమానులు, సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, తెలుగులో ఈ సినిమా హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది.
భారీ స్థాయిలో ఓపెనింగ్స్.. ప్రభాస్ నటించిన ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ అందుకుంటాయి. అంతకుముందే ఈ విషయం సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 'బాహుబలి' తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సక్సెస్ చూడకపోయినప్పటికీ కూడా.. ప్రభాస్ ప్రతి సినిమాకు అదే స్థాయిలో బజ్ క్రియేట్ అవుతూ వస్తోంది. వరల్డ్‌వైడ్‌గా 'బాహుబలి 2'కు రూ.215 కోట్లు, 'సాహో' రూ.125 కోట్లు, 'రాధే శ్యామ్' రూ.67కోట్లు ఓపెనింగ్ గ్రాస్ వచ్చాయి. ఇక ఇప్పుడు రామాయణం ఆధారంగా రూపొందిన 'ఆదిపురుష్' సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి.. ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి..