తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రిలీజ్​కు ముందే రూ.400 కోట్లు రాబట్టిన 'ఆదిపురుష్'!.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!! - ఆదిపురుష్​ బడ్జెట్​

Prabhas Adipurush Movie : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ హీరోగా సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ రిలీజ్​కు ముందే రూ.400 కోట్లను రాబట్టిందట. ఆ వివరాలు మీకోసం.

prabhas-adipurush-movie-500-crore-budget-recovered-432-crores-before-release
prabhas-adipurush-movie-500-crore-budget-recovered-432-crores-before-release

By

Published : Jun 2, 2023, 8:21 PM IST

Prabhas Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న మూవీ టీమ్.. ఇటీవల సినిమా నుంచి ట్రైలర్​తో పాటు జైశ్రీరామ్ అనే లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Adipurush Movie Budget : అయితే ఆదిపురుష్ రిలీజ్​కు ముందే బడ్జెట్​లో దాదాపు 85 శాతం రికవరీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ మూవీకి నిర్మాతలు సుమారు రూ.500 కోట్ల బడ్జెట్​ను కేటాయించారు. అయితే సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఏకంగా రూ.432 కోట్లు రాబట్టినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పాన్ ఇండియాలో లెవెల్​లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ మరియు ఇతర అనుబంధ హక్కులతో కూడిన నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.247 కోట్లకు అమ్ముడయ్యాట.

Adipurush Pre Release Business : దీంతోపాటు ఈ సినిమాకు సౌత్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.185 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. అలా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ మొత్తం కలుపుకొని విడుదలకు ముందే ఈ సినిమాకు రూ.432 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్​లో జరుపుకోవడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది. ఆదిపురుష్ విడుదలైన మూడు రోజులకే బాలీవుడ్​లో రూ.100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Adipurush Pre Release Event : టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్​పై భూషణ్ కుమార్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో నిర్మించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నగే నటిస్తున్నారు. జూన్ 6వ తేదీన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్​ను తిరుపతిలో కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఈ ఈవెంట్ కోసం ఏకంగా 200 మంది డాన్సర్లు, 200 మంది సింగర్లను రంగంలోకి దింపబోతున్నారట. ఇప్పటికే 'సాహో', 'రాధేశ్యామ్' ప్లాప్స్​తో సతమతమవుతున్న ప్రభాస్​కు 'ఆదిపురుష్' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details