Adipurush Box Office Collection : పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. అయినప్పటికీ తొలిరోజు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద క్రమ క్రమంగా ఢీలా పడిపోతూ వస్తోంది. తొలి రోజు ఈ సినిమా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకోగా.. తర్వాతి రెండు రోజులు కూడా రోజుకు రూ.100 కోట్లు అందుకొని మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి రూ.340 కోట్ల గ్రాస్ దాటగలిగింది.
Adipurush Collections : ఇక సోమవారం నుంచి ఈ కలెక్షన్స్‌లో మార్పులు వచ్చాయి. ఆరో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయని ట్రేడ్ వర్గాల టాక్. ఇక వరల్డ్‌వైడ్ ఈ సినిమా కలెక్షన్ రూ.410 కోట్లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.77.53 కోట్ల మేర వసూలు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇంకా రూ.66.24 కోట్లు రాబట్టాల్సి ఉంటుందని సినీ వర్గాల టాక్. వారం మొదట్లోనే ఇలా ఢీలా పడ్డా ఫలితాలను చూసిన విశ్లేషకులు.. వీకెండ్స్‌లో ఈ సినిమా కలెక్షన్స్ వేగం పుంజుకుంటే కానీ అనుకున్న టార్గెట్‌ను సాధించలేమని అంటున్నారు.