తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నా కెరీర్​లో 'సలార్​' లాంటి రోల్​ చేయలేదు- దాని కోసం ఆరు నెలలు ఎదురుచూశా : ప్రభాస్ - సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్

Prabhas About Salaar Movie : తన సినీ కెరీర్​లో 'సలార్​' వంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదని ప్రభాస్​ అన్నారు. ఈ మేరకు 'సలార్​' ప్రమోషన్స్​లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏన్నారంటే?

Prabhas About Salaar Movie
Prabhas About Salaar Movie

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 7:34 PM IST

Prabhas About Salaar Movie : రెబల్​ స్టార్ ప్రభాస్​ 'సలార్​'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'కేజీఎఫ్​' ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్​ ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాలో ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్​ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్‌'లో పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలుంటాయన్న ప్రభాస్​, ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయడంపై తన అనుభూతిని పంచుకున్నారు.

Salaar Promotions : 'ఈ చిత్రంలో పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలుంటాయి. ప్రేక్షకులు మొదటిసారి నన్ను ఇలాంటి రోల్​లో చూడబోతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్​లో నేను చేసిన మొదటి సినిమా ఇంది. నా ఐడియాలను కొన్నింటిని ప్రశాంత్​ నీల్​తో పంచుకున్నా. వాటిని తెరపై ఎలా చూపించాలో ఆయన చెప్పారు. మూవీ కోసం బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ కొన్ని ఆలోచనలు షేర్‌ చేశాను. వాటిలో కొన్ని డైరెక్టర్​కు నచ్చాయి. కీలక సీన్లకు ముందు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్లం. నా 21 ఏళ్ల కెరీర్‌లో నేను చూసిన బెస్ట్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. 'సలార్' షూట్‌కు ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురుచూశా. సెట్‌కు వెళ్లి నటించడం కంటే ముందు ప్రశాంత్‌నీల్‌తో సమయం గడపాలనిపించేది. నా సినీ కెరీల్​లో ఎప్పుడూ ఇలా అనుకోలేదు. ఆరు నెలలు తన ఫోన్‌ కోసం ఎదురు చూశాను. చిత్రీకరణ మొదలయ్యాక ఒక నెలలోనే మేము చాలా మంచి ఫ్రెండ్స్​ అయ్యాం'' అని రెబల్​ స్టార్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

Salaar Cast : ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారే కథతో సలార్​ తెరకెక్కించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పాటు ప్రేక్షకులను మెప్పించింది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ దీన్ని నిర్మించింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్, సీనియర్ నటుడు జగపతి బాబు, టీనూ ఆనంద్‌, ఈశ్వరీరావు, పృథ్వీ రాజ్, తదితరులు నటిస్తున్నారు.

సలార్​, ఉగ్రం స్టోరీలు ఒక్కటేనా? ప్రభాస్ నిర్మాత ఏం చెప్పారంటే?

'సలార్' ప్రైజ్ హైక్- యూఎస్​లో 25వేల టికెట్లు సోల్డ్- మల్టీప్లెక్స్​లో ధర ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details