తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వినోదయం సీతం'.. ఆ ప్రయోగం చేస్తారా?

'వినోదయ సీతం' రీమేక్​ టైటిల్​ విషయంలో ఓ ఎక్స్​పెరిమెంట్​ చేయాలని మూవీటీమ్​ ఆలోచిస్తుందని ప్రచారం సాగుతోంది. ఇంతకీ అదేంటంటే..

Power star pawan kalyan Sai tej vinodhaya sitham remake
'వినోదయం సీతం'.. ఆ ప్రయోగం చేస్తారా?

By

Published : Apr 18, 2023, 7:11 PM IST

ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ప్రస్తుతం ఆయన క్రిష్‌ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'లో నటిస్తున్నారు. దీని తర్వాత హరీశ్‌ శంకర్‌తో 'భవదీయుడు భగత్‌ సింగ్‌' చేయాల్సింది. కానీ ఆయన.. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్​తో కలిసి 'వినోదయ సీతం' రీమేక్ సినిమా చేస్తున్నారు​. ఈ ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. మాతృకకు దర్శకుడుగా వ్యవహరించిన యాక్టర్​ కమ్​ డైరెక్టర్​ సముద్రఖనినే తెరకెక్కిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై సినిమా రూపొందుతోంది. రీసెంట్​గా సెట్స్​పై వెళ్లిన ఈ చిత్రం.. అప్పుడే కీలక భాగాన్ని షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ టాకీ పార్ట్ కూడా ఎప్పుడో ఫినిష్ చేసేశారు.

అయితే ఈ సినిమా టైటిల్​ గురించి ఇప్పటికే పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పవన్ తేజల మొదటి అక్షరాలాను కలిపి.. ప్రస్తుతానికి ఓ హ్యాష్ ట్యాగ్​ను రూపొందించి సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవర, దేవుడు అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీటీమ్​ ఓ ప్రయోగం చేయడానికి సిద్ధమైందని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. టైటిల్​ పెట్టకుండానే చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్​ చేస్తున్నారట. విడుదల అయ్యాక ఆడియెన్స్​ అభిప్రాయాల్ని తీసుకుని టైటిల్​ను ఖరారు చేస్తారట.

గతంలో ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఇలా ఎప్పుడు చేయలేదు. కానీ గతంలో ఓ హీరో చిత్రానికి ఇలా చేశారట. తర్వాత ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు టైటిల్​ను ఓకే చేశారట. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ అలా చేసినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ.. ఓ మల్టీ స్టారర్ సినిమాకు ఇలా చేయలాని సిద్ధమవుతున్నారు. ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. మరి నిజంగానే ఇలా చేస్తారా లేదా ప్రచారం మాత్రమేనా ప్రస్తుతానికి తెలీదు. ఏదీ ఏమైనా సినిమా రిలీజ్​కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. టైటిల్​ను ఆలోచించుకునేందుకు మూవీటీమ్​కు టైమ్​ ఉన్నట్టే.

కాగా, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామాకు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూరుస్తున్నారు. పవన్‌ దేవుడిగా కనిపించనుండగా.. సాయిధరమ్‌ తేజ్‌ ఆయన భక్తుడిగా కనిపించనున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇకపోతే ఒరిజినల్ వెర్షన్​తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారని తెలిసింది. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ కూడా చెప్పారు. సినిమా జులై 28న థియేటర్లలో రిలీజ్​ కానుంది.

ఇదీ చూడండి:'శాకుంతలం'తో ప్రభాస్​ 'ఆదిపురుష్' టీమ్​లో భయం!

ABOUT THE AUTHOR

...view details