తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మామా అల్లుళ్ల కాంబో.. పవర్​ స్టార్ 'బ్రో' ఎలా ఉందంటే ? - బ్రో మూవీ ట్విట్టర్​ రివ్యూ

Bro Twitter Review : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీకి ట్విట్టర్​లో ఆడియెన్స్​ రెస్పాన్స్​ ఎలా ఉందంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 28, 2023, 7:16 AM IST

Updated : Jul 28, 2023, 9:13 AM IST

Bro Twitter Review : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'బ్రో'. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా శుక్రవారం అటు ఇండియాతో పాటు ఇటు ఓవర్సీస్​ థియేటర్లలో సందడి చేస్తోంది. మామా అల్లుళ్ల కాంబినేషన్​లో వచ్చిన ఈ సినిమా గురించి అటు మెగా ఫ్యాన్స్​తో పాటు ఇటు మూవీ లవర్స్​ తెగ ఎదురు చూశారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్ షోస్​కు వెళ్లిన ఫ్యాన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు నెట్టింట మంచి టాక్​ వినిపిస్తోంది. స్టోరీ లైన్‌ చాలా ఆసక్తికరంగా ఉందని ఒక నెటిజన్​ అభిప్రాయపడగా.. ఫ్యాన్​ మూమెంట్స్​ చాలానే ఉన్నాయని మరొకరు కామెంట్​ చేశారు. ఇందులో ఎమోషన్స్​కు ప్రాముఖ్యత ఉందని.. బ్యాక్​గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణమని మరికొందరు అంటున్నారు. ఓ వైపు ఫ్యాన్స్​ని అలరించే సీన్లు సాగుతూనే మరోవైపు డివోషనల్‌ టచ్‌ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ రెండింటిని ఈ సినిమాలో బ్యాలెన్స్ చేసినట్టు చెబుతున్నారు. ఇక సినిమాకు తమన్​ బీజీఎం హైలైట్‌ అని టాక్​. డైలాగులు, స్క్రీన్‌ ప్లే కూడా బాగున్నాయని అంటున్నారు.

ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. పాటలు బాగున్నాయి. ఫ్యాన్స్‌కు మంచి అనుభూతి కలిగించే సన్నివేశాలు ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సాయికి అద్దంలో చూపించే సీన్. జీవితంలో ప్రాక్టికాలిటీస్‌ గురించి చెప్పే విషయాలు మూవీకి హైలైట్​ సీన్స్​ అని టాక్​. మూవీ లవర్స్‌ ఇందులోని డైలాగ్స్​కు బాగా కనెక్ట్ అవుతారని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Bro Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. కోలీవుడ్​లో భారీ విజయాన్ని అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేసిన 'వినోదయ సీతమ్' అనే సినిమాకు రీమేక్​గా రూపొందిన ఈ మూవీని తమిళ దర్శకుడు సముద్రఖని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగ్స్​, స్క్రీన్‌ప్లే అందించారు. ఇక తమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగితాన్ని అందించారు.

Last Updated : Jul 28, 2023, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details