తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సంగీత దర్శకుడిగా పవర్‌స్టార్‌ కొడుకు అకీరా.. సినిమా పేరేంటంటే? - అకీరా నందన్​ లఘు చిత్రం

పవన్‌కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్​ సంగీత దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఓ చిత్రానికి అతడు సంగీతం అందించాడు! ఆ వివరాలు..

power star pavan kalyan son akira-nandan-become-a-music-director-for-a-short-film
power star pavan kalyan son akira-nandan-become-a-music-director-for-a-short-film

By

Published : Apr 12, 2023, 10:21 PM IST

Updated : Apr 12, 2023, 10:28 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ సంగీత దర్శకుడిగా మారాడు. రైటర్స్‌ బ్లాక్‌ అనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటిసారి అతడు సంగీతం అందించాడు. ఇదే విషయాన్ని నటుడు అడివి శేష్‌ వెల్లడించారు. రైటర్స్‌ బ్లాక్‌ షార్ట్‌ ఫిల్మ్ లింక్‌ను ట్విట్టర్​లో షేర్‌ చేశారు. టీమ్‌కు అభినందనలు చెప్పారు. తనకెంతో ఇష్టమైన అకీర ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాడని పేర్కొన్నారు.

ఒక రచయిత.. కథను రాయడంలో సవాళ్లు ఎలా అధిగమించాడు అనే కథాంశంతో ఈ లఘుచిత్రం రూపుదిద్దుకుంది. ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. మనోజ్‌ నటించగా.. ఫణి మాధవ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్‌కు అకీరా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్‌కు అతడు అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది.

అకీరాకు మ్యూజిక్‌ అంటే ఎంతో ఆసక్తి. అతడు ప్రత్యేకంగా పియానో ప్లే చేయడం నేర్చుకున్నాడు. గతంలో తన స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని దోస్తీ పాటను పియానోపై ప్లే చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అడివి శేష్‌ - అకీరాకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కార్యక్రమంలో అకీరాను కలిశానని, ఆనాటి నుంచి అతడంటే తనకెంతో ఇష్టం ఏర్పడిందని శేష్‌ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

ఇటీవలే.. అకీరా నందన్​ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌పై నటి రేణూ దేశాయ్‌ సామాజిక మాధ్యమ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'అకీరా నా కొడుకు. మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అంటూ తన అసంతృప్తిని బయటపెట్టారు. నెటిజన్ల నుంచి వస్తోన్న ఇలాంటి ట్వీట్ల వల్ల తాను బాధపడుతున్నట్లు వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్‌ గత శనివారం 19వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రేణు దేశాయ్​ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇక ఆ వీడియోపై పలువురు పవన్​ అభిమానులు కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆ పోస్ట్​పై స్పందించిన ఓ ఫ్యాన్​ "మేడమ్‌.. ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది" అని కామెంట్‌ చేశాడు. దీంతో ఆ కామెంట్‌పై అసహనం వ్యక్తం చేసిన రేణు.. "మీ అన్న తనయుడా..? అకీరా నా అబ్బాయి!! మీరు వీరాభిమానాలు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడే పద్ధతి కొంచం నేర్చుకోండి! ఇలాంటి మెసేజ్​లు, కామెంట్లను నేను ప్రతిసారీ పట్టించుకోకుండా వదిలేస్తుంటాను. కానీ, మీలాంటి కొంతమంది మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు" అంటూ రిప్లై ఇచ్చారు.

Last Updated : Apr 12, 2023, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details