Poojahegdey Bhavadeeyudu Bhagatsingh: 'రాధేశ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య'లతో ఈ ఏడాది వరుస ఫ్లాప్‌లు ఎదురైన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు హీరోయిన్ పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్ మూవీ, హిందీలో సల్మాన్‌ఖాన్ 'కభీ ఈద్ కభీ దివాళీ', రణ్వీర్ సింగ్ 'సర్కస్' చిత్రాల్లో నటిస్తోంది. దీంతోపాటే పవన్‌కల్యాణ్ 'భవదీయుడు భగత్‌సింగ్'లోనూ నటించనున్నట్లు ప్రచారం సాగింది. పలువురు నాయికల పేర్లను పరిశీలించిన చిత్రయూనిట్ పూజాహెగ్డేను హీరోయిన్గా ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. హిందీ చిత్రాలతో పాటు మహేశ్ సినిమాకు ఆమె కంటిన్యూషన్గా డేట్స్ కేటాయించిందట! ఈ క్రమంలోనే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
పవన్ మూవీ నుంచి పూజా ఔట్.. చరణ్ కొత్త సినిమా కోసం అనిరుధ్! - రామ్‌చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా
పవన్‌కల్యాణ్ 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమా నుంచి హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకున్నట్లు తెలిసింది. మరోవైపు రామ్‌చరణ్-గౌతమ్ తిన్ననూరి మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
Ramcharan Gowtam tinnanuri movie music director: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈసినిమాప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. దీని తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే అధిరికంగా ప్రకటించిన ఈ చిత్రం.. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీకీ సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో మూవీటీమ్ ఉందట! ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. దాదాపు ఖరారు అయినట్లేనని సినీవర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, డైరెక్టర్ గౌతమ్ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులుదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు దర్శకుడు గౌతమ్ గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇదీ చూడండి: షారుక్-అట్లీ మూవీ ఫస్ట్‌లుక్ వైరల్.. బాద్షా గెటప్ సూపర్!