తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విజయ్‌ 'జనగణమన'లో హీరోయిన్​ ఈ ముద్దుగుమ్మేనా? - vijay devarkonda janagana mana movie

VijayDevarkonda Janaganamana movie heroine: విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబోలో తెరకెక్కనున్న 'జనగణమన'లో ఓ స్టార్​ హీరోయిన్​ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

Vijay devarkonda Purijagannadh movie Janaganamana pooja hegdey
విజయ్​ జనగణమన పూజాహెగ్డే

By

Published : May 6, 2022, 8:59 AM IST

Updated : May 6, 2022, 9:14 AM IST

VijayDevarkonda Janaganamana movie heroine: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ-అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం 'జనగణమన'. ఇటీవలే పూర్తయిన 'లైగర్‌' తర్వాత ఈ కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రమిది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా పూరి జ‌గ‌న్నాథ్ ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఛార్మి, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'జేజీఎం' పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. త్వరలోనే రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించుకోనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండతో జోడీకట్టే నాయిక ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప‌లువురు అగ్ర‌క‌థానాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన పూరి జ‌గ‌న్నాథ్‌ చివ‌ర‌కు పూజాహెగ్డేను ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. బుట్ట‌బొమ్మ కూడా ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ద్వారా విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూజాహెగ్డే తొలిసారి జంటగా నటించినట్లవుతుంది.

ఇక ఈ నెల 12 నుంచి స‌ల్మాన్‌ఖాన్ 'క‌భీ ఈద్ క‌భీ దివాళీ' సినిమా షూటింగ్‌లో పూజాహెగ్డే పాల్గొన‌బోతున్న‌ది. ముంబయిలో వేసిన భారీ సెట్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ లాంగ్ షెడ్యూల్ త‌ర్వాత ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి: Review: శ్రీవిష్ణు 'భళా తందనాన' ఎలా ఉందంటే?

Last Updated : May 6, 2022, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details