తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమల్​హాసన్​తో డేటింగ్​.. ఈ సారి ఆ హీరోయిన్​ ఏం చెప్పిందంటే? - పూజా కుమార్​ కమల్​హాసన్ రిలేషన్ షిప్​

విలక్షణ నటుడు​ కమల్‌ హాసన్​తో డేటింగ్​లో ఉన్నట్టు కొంత కాలంగా వస్తున్న వార్తలపై మరోసారి స్పందించారు నటి పూజా కుమార్​. ఏం అన్నారంటే..

pooja kumar gave clarifies on relationship with Kamalhassan
కమల్​హాసన్​తో డేటింగ్​.. ఈ సారి ఆ నటి ఏం చెప్పిందంటే?

By

Published : Dec 7, 2022, 11:49 AM IST

యూనివర్సల్​ స్టార్​ కమల్‌ హాసన్​తో నటి పూజా కుమార్‌ డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రూమర్స్​ను మరోసారి పూజా ఖండించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆమె స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. "కమల్ హాసన్​తో నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఈ రూమర్స్ వస్తున్నాయి. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించొద్దు" అని ఆమె చెప్పినట్లు ఆ కథనాల్లో ఉంది.

కాగా, కమల్​-పూజా కలిసి 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం 2'లో నటించారు. ఇక ఈ సినిమాల్లో వీరిద్దరి రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే పూజా కుమార్​..​ కమల్‌తోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతోనూ స్నేహంగా ఉంటున్నారు. కమల్‌ ఫ్యామిలీ వేడుకల్లో పూజా కుమార్‌ కూడా పలుమార్లు కనిపించారు. ఇక కమల్​ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే విక్రమ్ సినిమాతో సూపర్​ హిట్​ అందుకున్న ఆయన ప్రస్తుతం తన కొత్త చిత్రాలను లైన్​లో పెట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఇండియన్ 2' (తెలుగులో భారతీయుడు 2) షూటింగ్​లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి:అల్లు అర్జున్ తర్వాతే విజయ్​ ఈ ఏడాది టాప్​ 10 ట్రెండింగ్​ సాంగ్స్​ ఇవే

ABOUT THE AUTHOR

...view details