Pooja Hegde Threats :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు మరణ బెదిరింపులు వచ్చాయన్న పుకార్లను ఆమె టీమ్ కొట్టిపారేసింది. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. "ఈ అబద్దపు ప్రచారాలు ఎవరు ప్రారంభించారో తెలియదు. అదంతా పూర్తిగా అవాస్తవం" అని పూజా టీమ్ చెప్పింది.
ఇదీ జరిగింది :హీరోయిన్ పూజా ఓ క్లబ్ ఓపెనింగ్‌లో పాల్గొనేందుకు ఇటీవల దూబాయ్ వెళ్లింది. అయితే అక్కడ క్లబ్ ఈవెంట్లో ఆమె గొడవ పడిందని, ఈ కారణంగా హీరోయిన్‌కు హత్యా బెదిరిపులు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో పూజ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే పూజ టీమ్ క్లారిటీ ఇవ్వడం వల్ల, అభిమానులు హ్యాపీ ఫీలౌవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఫేక్ పోస్ట్‌ను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.
'నాకు అందులో అకౌంట్ లేదు' లోకేశ్
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుధవారం సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ విషయంపై గంటల్లోనే లోకేశ్ స్పందించారు. ఆయనకు అసలు ఫేస్బుక్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు.' అందరికి హాయ్! నేను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మాత్రమే అందుబాటులో ఉంటా. ఈ రెండు తప్పా నాకు ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఏవీ లేవు. సో అందరూ రిలాక్స్ అవ్వండి. ఒకవేళ వీటిలో తప్ప, వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో నా పేరుతో ఉన్న అకౌంట్ ఫాలో అవుతున్నట్లైతే, వెంటనే అన్‌ఫాలో కొట్టేయండి' అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.