బాలీవుడ్ భాయ్ సల్మాన్‌ఖాన్ నటించిన కొత్త చిత్రం 'కిసీ కా బాయ్ కిసీ కీ జాన్'. పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. 'వీరమ్', 'కాటమరాయుడు' చిత్రాలకు రీమేక్‌గా ఇది తెరకెక్కిందని సమాచారం. మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే హీరోయిన్ పూజాహెగ్డే కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఒకే రోజు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఇందులో భాగంగా.. ఆమె సల్మాన్ డ్యాన్స్‌పై వచ్చిన ట్రోల్స్, మీమ్స్‌పై స్పందించింది.
"మా సినిమా నుంచి 'నైయో లగ్డా' పాట కొద్ది రోజుల క్రితం విడుదలైంది. అయితే దీనిపై కొంతమంది మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. బాగా ట్రోల్స్ కూడా చేశారు. వాటిని చూసి నేనైతో ఫుల్‌గా నవ్వుకున్నాను. మనుషులు ఎంతో స్పీడ్‌గా అయిపోయారనిపించింది. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే దానిపై మీమ్స్ క్రియేట్ చేసేస్తున్నారు" అని పూజా చెప్పింది.
సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. "నేను సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. సోషల్‌మీడియాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నాపై వచ్చే విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ కూడా చూస్తుంటాను. చదువుతుంటాను. అయితే నేను అన్ని విమర్శలను ఒకేలా చూడను. కొంతమంది కావాలనే నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తుంటారు. వాటిని నేను అస్సలు పట్టించుకోను. నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. వాటిని పరిగణలోకి తీసుకుంటాను. నేను అందర్నీ సంతోష పెట్టలేను కదా. నాలాగా నేను ఉంటూ ముందుకు సాగుతుంటాను" అని పూజా చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడింది. SSMB 28లో మహేశ్ బాబును కొత్తగా చూసేందుకు రెడీగా ఉండమని చెప్పింది.