తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కలెక్షన్స్​లో దూసుకెళ్తున్న 'పొన్నియన్​ సెల్వన్'​.. రెండు రోజుల్లో ఎంతంటే? - పొన్నియన్ సెల్వన్ కలెక్షన్స్​ 100 కోట్లు

సెప్టెంబరు 30న విడుదలైన భారీ బడ్జెట్​ చిత్రం పొన్నియన్​ సెల్వన్ హిట్​టాక్​తో దూసుకెళ్తోంది. కలెక్షన్స్​ పరంగానూ మంచి వసూళ్లను అందుకుంటోంది. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ponniyan selvan collections
పొన్నియన్ సెల్వన్ కలెక్షన్స్​

By

Published : Oct 2, 2022, 10:56 AM IST

Updated : Oct 2, 2022, 11:09 AM IST

దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బహు భాషా చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌' మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్‌ టాక్‌ అందుకుంటోన్న ఈ సినిమాకు తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' అనే నవల మాతృక. చోళుల కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్‌, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్​ రెహమాన్ సంగీతం అందించారు.

అయితే ఈ సినిమా రెండు రోజుల్లో మంచి వసూళ్లను అందుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లకు పైగా సాధించిందని సినీ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ సోషల్​మీడియాలో​ పోస్ట్ చేశారు.

తొలిరోజు ఓపెనింగ్​ కలెక్షన్స్​ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.78.29కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో రూ.25.86కోట్లు, ఏపీ, తెలంగాణాలో రూ.5.93కోట్లు, కర్ణాటక రూ.5.04కోట్లు, కేరళ రూ.3.70కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.51కోట్లు, ఓవర్సీస్​లో రూ.34.25కోట్లు వచ్చినట్లు తెలిపారు. 2022లో ప్రపంచ బాక్సాఫీస్​ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లను సాధించిన కోలీవుడ్​ చిత్రం ఇదేనని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈ తారలు ఆ వ్యాధులతో అంతలా బాధపడ్డారా?.. నొప్పిని భరిస్తూనే షూటింగ్స్​కు!

Last Updated : Oct 2, 2022, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details