Modi Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022' పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు.
చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం.. ఎందుకంటే? - ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ చిరు
టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేసిన మోదీ.. చిరును మెచ్చుకున్నారు.
"చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణనూ పొందుతున్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు" అని పేర్కొన్నారు.
గోవాలోని పనాజీలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు ఈ నెల 29 వరకూ కొనసాగనున్నాయి. మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే, సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందిస్తారు.