తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pindam Movie Teaser : 'ది స్కేరియస్ట్ ఫిల్మ్'.. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. భయపెట్టేలా టీజర్​.. - పిండం సినిమా రిలీజ్ డేట్

Pindam Movie Teaser : ప్రముఖ నటుడు శ్రీరామ్ నటిస్తున్న కొత్త హారర్ థ్రిల్లర్​ చిత్రం​ 'పిండం' టీజర్ రిలీజై భయపెడుతోంది! మీరు చూశారా?

Pindam Movie Teaser : 'ది స్కేరియస్ట్ ఫిల్మ్'.. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. భయపెట్టేలా టీజర్​..
Pindam Movie Teaser : 'ది స్కేరియస్ట్ ఫిల్మ్'.. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. భయపెట్టేలా టీజర్​..

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 12:25 PM IST

Pindam Movie Teaser : రోజా పూలు, ఒకరికి ఒకరు ఫేమ్​ ప్రముఖ నటుడు శ్రీరామ్ నటిస్తున్న కొత్త హారర్ థ్రిల్లర్​ చిత్రం​ 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో సాయికిరణ్ దైదా డైరెక్టర్​గా ఇంట్రడ్యూస్​ కానున్నారు. ఈ చిత్రం రిలీజ్​కు రెడీ అవ్వడంతో రీసెంట్​గా ఫస్ట్​ లుక్​ విడుదల చేసిన మేకర్స్​.. తాజాగా టీజర్​ను రిలీజ్ చేశారు. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్​ లైన్​కు తగ్గట్టుగానే ఈ ప్రచార చిత్రం మొత్తం భయపెట్టేలా సాగుతూ ఆడియెన్స్​లో ఉత్సుకతను రేపింది.

"ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం" అంటూ ఈశ్వరీ రావు చెప్పే సంభాషణతో ప్రారంభమైన ఈ టీజర్​లో ఆమె ఓ ఇంట్లోకి వెళ్ళి ఆత్మ ఆవహించిన అమ్మాయితో మాట్లాడటం.. ఆ తర్వాత 'మీ కెరీర్​లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా?' అని అవసరాల శ్రీనివాస్ అడగడం.. దానికి 'ఉంది. అది చాలా ప్రత్యేకమైనది. దానిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా అటువంటి దాని గురించి వినలేదు. అదొక అపారవంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మ కథ" అంటూ ఈశ్వరీ రావు బదులివ్వడం అంతా ఇంట్రెస్టింగ్​గా సాగింది. అప్పుడు ఇది నిజ సంఘటనల ఆధారంగా తీసినట్లు మేకర్స్​ టీజర్​లో రివీల్ చేశారు.

అనంతరం శ్రీరామ్ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంట్లో అనుకోని భయపెట్టే సంఘటనలు చోటు చేసుకోవడం, ఆ తర్వాత ఆత్మను చూసి కుటుంబ సభ్యులంతా చావు భయంతో పరిగెత్తడం, పాపకు ఆత్మ ఆవహించినట్లు చూపించడం వంటి సీన్స్​ అన్నీ భయపెట్టేలా చూపించారు. అక్కడ 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అంటూ రివీల్ చేశారు. అసలు ఆ ఇంట్లో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఎవరు? ఆ ఆత్మ కథేంటి? అనేది తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

'కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాని సరిహద్దులు మనకు అర్థమవుతాయి. కానీ లోపల ప్రపంచానికి సరిహద్దులు ఉండవు. అది అంత తేలికగా అర్థంకాదు' అంటూ ఈశ్వరీ రావు చెప్పే డైలాగ్​తో టీజర్​ను ముగించారు. ప్రచార చిత్రం మొత్తానికి బీజీఎం హైలైట్​గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

This week movie Releases : ఈ వారం థియేటర్​/ఓటీటీలో 13 సినిమాలు.. నవ్విస్తూనే భయపెట్టేలా!

Mrunal Thakur Upcoming Movies : మృణాల్​​ ఠాకూర్ భవిష్యత్​​.. ఆ రెండిటిపైనే భారీ ఆశలు!

ABOUT THE AUTHOR

...view details