తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సర్కారువారి పాట' టికెట్‌ ధర పెంపు.. ఎంతంటే? - సర్కారువారి పాట తాజా వార్తలు

sarkaruvari paata ticket price : 'సర్కారువారి పాట' సినిమాకు టికెట్ ధర పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజులపాటు టికెట్‌పై రూ.45 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

AP Government permission to increase sarkaruvari paata ticket pric
'సర్కారువారి పాట' టికెట్‌ ధర పెంపు.. ఎంతంటే?

By

Published : May 7, 2022, 5:00 PM IST

sarkaruvari paata ticket price :మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సూపర్‌ హైబడ్జెట్‌ కేటగిరీ కింద టికెట్‌పై రూ.45 పెంచనున్నారు. 10 రోజుల పాటు పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'సర్కారువారి పాట' చిత్ర టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలోనూ ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. 223 లొకేషన్లలో 648 షోలను ప్రదర్శించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి, తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details