ఆర్ఎక్స్ 100తో ఒక్కసారిగా సెన్షేషనల్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తాజాగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'మంగళవారం' సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో ఆమె న్యూడ్‌గా కనిపించి అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో పాయల్ మరింత బోల్డ్‌గా కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే 'మంగళవారంలో' హద్దులు దాటి బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు అజయ్ భూపతియే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ఎ' క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థను అజయ్ భూపతి స్థాపించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
'ఈ సినిమా 1990 దశకంలోని ఓ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండబోతోంది. కంప్లీట్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ ఫిల్మ్ ఇది. సినిమా చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ పాయల్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇటువంటి కొత్త జానర్ సినిమా ఎవరూ ప్రయత్నించ లేదు. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉంటాయి. ప్రతీ పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది'' అని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు.
హాట్‌టాపిక్‌గా పోస్టర్ .'మంగళవారం' సినిమా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు నెట్టింట చర్చ అంతా ఈ పోస్టర్ గురించే. ఇంతకీ ఆ పోస్టర్ ఎలా ఉందంటే.. పాయల్ ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. ఫోటో వెనుక నుంచి తీశారు. పోస్టర్‌ను గమనిస్తే.. పాయల్ కళ్లలో కన్నీటి పొర కనబడుతోంది. తన చూపుడు వేలిపై సీతాకోక చిలుక ఉంది. తలలో మల్లెపూలతో ఉంది. హీరోయిన్ ఎమోషన్స్ చూపుతున్నట్లు ఉంది ఈ పోస్టర్.
ఇకపోతే పాయల్.. ఆర్ఎక్స్ 100 తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలేవీ ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆది సాయికుమార్, మంచు విష్ణుల సరసన కూడా నటించిందీ ముద్దుగుమ్మ. విక్టరీ వెంకటేశ్‌తో కలిసి హీరోయిన్గా చేసిన వెంకిమామ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్ఎక్స్ 100లో ఇందు పాత్రతో నెగిటీవ్ రోల్లో మెప్పించిన పాయల్.. ఇప్పుడు 'మంగళవారం'లోనూ అటువంటి పాత్రలోనే కనిపించనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్