పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఇటీవలే ఈ సినిమా ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్, క్రిష్, కీరవాణి సహా పలువురు పాల్గొన్నారు. అయితే ఈ ఫొటోల్లో పవన్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెడ్ టీషర్ట్, జీన్స్, షూస్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ స్టోరీ డిస్కషన్ చేస్తూ కనిపించారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ పవన్ పెట్టుకున్న వాచ్, వేసుకున్న షూస్‌పై నెట్టింట ఓ చర్చ జరుగుతోంది. ఆయన ధరించిన వాచ్ రూ.14 లక్షలని, షూస్ రూ.10 లక్షలు అంటూ కొందరు ట్రోల్ చేశారు. అయితే అది నిజం కాదంటూ మరి కొందరూ వాటికి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అవి ఏ కంపెనీకి చెందినవి, వాటి ధర ఎంత ఉంటుంది? వంటి విషయాలు తెలుపుతూ కొన్ని కథనాలు వచ్చాయి.
వాటి ప్రకారం.. పవన్ పెట్టుకున్న వాచ్ ఇటలీ సంస్థ పనేరాయ్ కంపెనీకి చెందిందట. పనేరాయ్ లోని సబ్ మెర్సిబుల్ కార్బోటెక్ 47ఎంఎం అనే మోడల్ వాచ్ అంట. దాని ధర అక్షరాలా రూ.14,37,000 అని తెలిసింది. ఇక షూస్ Copenhagen కంపెనీకి చెందినవట. దీని ధర మాత్రం పది లక్షలు ఉండవని.. రూ.9,600 వరకు ఉంటుందని అంటున్నారు.