తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నెల గ్యాప్​లో పవన్ 'ఉస్తాద్​' - 'ఓజీ'.. అసలు అయ్యే పనేనా? - ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి రిలీజ్ డేట్

Pawan kalyan ustaad bhagat singh : పవన్ కల్యాణ్​ 'ఉస్తాద్​ భగత్ సింగ్​' - 'ఓజీ' సినిమా రిలీజ్​లను నెల రోజుల గ్యాప్​లో ఉండేలా ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

Ustaad OG
పవన్ ఉస్తాద్ ఓజీ రిలీజ్ డేట్​

By

Published : Aug 3, 2023, 5:22 PM IST

Pawan kalyan ustaad bhagat singh : పవర్ స్టార్​ పవన్ కళ్యాణ్ రీసెంట్​గా 'బ్రో' చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మౌత్ టాక్ గురించి పక్కనపెడితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంది. అయితే ఇప్పుడు పవన్​ 'ఉస్తాద్ భగత్ సింగ్​' వచ్చే సంక్రాంతి బరిలోకి దిగనుందన్న వార్త జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఆగిపోయిందనుకున్న ఈ చిత్రాన్ని మళ్లీ షురూ చేసి ఈ ఏడాదే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Pawan kalyan og movie release date : అయితే దీంతో పాటే ఇప్పుడు పవన్ 'OG' రిలీజ్ డేట్​ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే సగానికి వరకు షూటింగ్​ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఉస్తాద్ కన్నా ముందే థియేటర్లలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారుట. దీనికి కూడా పవన్ డేట్స్​ ఇచ్చారని తెలిసింది. గతంలో ప్రచారం ఉన్న ఈ ఏడాది డిసెంబర్ నెలకే చిత్రాన్ని విడుదల చేయాలని మూవీమేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారట.

ఒకవేళ ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి రెడీ అయితే.. రెండు నెలల గ్యాప్​లో థియేటర్లలో సందడి చేస్తాయి. ఇక ఇది తెలుసుకుంటున్న సినీ ప్రియులు.. అసలు ఇది సాధ్యమవుతుందా.. ఐదు నెలల్లో రెండు సినిమాల షూటింగ్ ఎలా పూర్తవుతాయి? అంత తక్కువ వ్యవధిలో రెండు చిత్రాలు రిలీజ్​కు ఎలా సాధ్యం? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పవన్ తనకున్న పాలిటిక్స్​ బిజీ షెడ్యూల్​లో ఏ సినిమాను త్వరగా పూర్తి చేస్తారో? ఏ సినిమాకు ఎక్కువ డేట్స్​ ఇస్తారో? అనేది.

ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. పవన్‌ - హరీశ్‌శంకర్‌ కాంబోలో గతంలో వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌'కు సీక్వెల్​గా ఇది రాబోతుంది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కలిసి పనిచేయడంతో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'పై అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌ గింప్స్‌ కూడా ఆకట్టుకుంది. OG సినిమా విషయానికొస్తే.. 'సాహో'ఫేం సుజీత్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పవన్‌ సరసన నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటించనుంది. గ్యాంగ్ స్టార్​ నేపథ్యంలో ముంబయి బ్యాక్​ డ్రాప్​లో ఈ సినిమా రూపొందుతోంది.

ఇదీ చూడండి :

Trivikram pawankalyan : త్రివిక్రమ్​కు పవన్ కల్యాణ్ ఎదురెళ్లి పోటీపడతారా?

'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

ABOUT THE AUTHOR

...view details