Bro movie theme song : పవన్ కల్యాణ్ - సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'బ్రో'. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక్కోక్కటిగా వరుస అప్డేట్లను ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోంది మూవీటీమ్. తాజాగా 'బ్రో' థీమ్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. పవన్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. 'కాల త్రిగుణ సంశ్లేషం.. కాల గమణ సంకాశం' అంటూ సంస్కృత పదాలతో ఉన్న ఈ లిరిక్స్‌కు తమన్ సమకూర్చిన బాణీలు, బీట్ అదిరిపోయింది. గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పాట ఆద్యంతం ఎంతో వినసొంపుగా ఉంది. హై ఫీల్‌ను అందిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Bro movie teaser : అంతగా రానీ హైప్.. సాధారణంగా పవన్ మూవీ అంటే రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే సోషల్‌మీడియా భారీ హైప్ కనిపించేది. అయితే 'బ్రో' సినిమా విషయంలో అలా కనపడలేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు సాంగ్స్ పవన్ ఫ్యాన్స్‌ను అంతగా ఆకట్టుకోలేదు. తమన్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదని అన్నారు. దగీంతో అవి సోషల్‌మీడియాలో అంతగా ట్రెండ్ కూడా అవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన థీమ్ లిరికల్ వీడియో సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ పాటనే సినిమాపై హైప్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇకపోతే ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు.
Bro movie cast : సినిమాలో పవన్ కళ్యాణ్‌ను టైమ్ అనే మోడ్రన్ గాడ్ పాత్రలో కనిపించనున్నారు. సాయితేజ్ మార్క్ అనే పాత్రలో నటించారు. హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. ఒరిజినల్ వెర్షన్ 'వినోదయ సీతమ్'కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. సినిమాను స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పవన్ సన్నివేశాల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ రాశారట.