Pawankalyan Remuneration: టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోల్లో పవన్‌కల్యాణ్ ఒకరు. అయితే ఇప్పుడు ఆయనకు మరింత ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
పవన్ నటించనున్న సినిమాల్లో 'వినోదయ సీతమ్' రీమేక్ ఒకటి. నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సీతమ్' తమిళంలో సూపర్ హిట్‌ను అందుకుంది. తెలుగులోనూ ఆయనే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీ కోసం పవన్.. 20రోజుల పాటు కాల్ షీట్స్ ఇచ్చారని, రూ.50కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే.. మరో పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. అంటే పవన్ రెమ్యునరేషన్ రోజుకు రూ.3కోట్లు అన్న మాట. ప్రస్తుతం ఈ విషయం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.