Pawankalyan Ramcharan movie: మెగాస్టార్ చిరంజీవి-రామ్‌చరణ్ కలిసి పూర్తిస్థాయి పాత్రలో ఒకే తెరపై కనపడాలన్న అభిమానుల కోరిక 'ఆచార్య'తో తీరబోతుంది. అయితే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-చరణ్‌ను కూడా ఒకే స్క్రీన్‌పై చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. ఈ పవర్ఫుల్ కాంబోను త్వరలోనే తెరపై చూస్తారని అన్నారు.
"బాబాయ్‌తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా. సరైన కథ కోసం ఎదురుచూస్తున్నా. కథ కుదిరినప్పుడు కచ్చితంగా సినిమా ఉంటుంది. ఆ చిత్రాన్ని నేనే నిర్మించవచ్చు. ఇక నా బ్యానర్లో బాబాయ్, ఆయన బ్యానర్లో నేను నటించాలని అనుకుంటున్నాం." అని చరణ్ అన్నారు.