Pawankalyan OG Glimpse : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'OG'(ఒరిజినన్ గ్యాంగ్‌స్టర్). ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతున్నా.. పెద్దగా అప్‌డేట్లు ఏమీ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ.. అంచనాలకు మించి.. పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన 'OG' హంగ్రీ చీతా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
OG Hungry Cheetah : తాజాగా రిలీజైన ఈ టీజర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రతీది మైండ్ బ్లో రేంజ్లో ఉన్నాయి. శత్రువులను చిరుతలా వేటాడుతూ.. పవన్ కల్యాణ్ తన విశ్వరూపం చూపించారు. ఒక్కో సీన్ ఒక్కో రేంజ్లో గూస్బంప్స్ తెప్పించేశాయి. ఈ గ్లింప్స్ వీడియోకు భారీ స్థాయిలో విశేష స్పందన వస్తోంది. దీన్ని పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్‌కు బాగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ గ్లింప్స్‌కు భారీగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అయితే ఈ గ్లింప్స్ 24 గంటల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లైక్డ్గా గ్లింప్స్‌గా రికార్డ్ సాధించింది. 16 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకుంది. అలాగే, 731K లైక్స్‌కు పైగా సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో నెం.1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. గతంలో భీమ్లానాయక్.. 728.5K లైక్స్‌తో ముందుండగా.. ఇప్పుడు తాజాగా ఓజీ దాన్ని అధిగమించడం విశేషం. #HUNGRYCHEETAH హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పుల్ ట్రెండింగ్ అవుతోంది.
OG Cast And Crew : ఇకపోతే ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.