తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా హరి హర వీరమల్లు గ్లింప్స్​.. చూస్తే గూస్‌బంప్స్‌ పక్కా.. - హరిహర వీరమల్లు గ్లింప్స్​

హరి హర వీరమల్లు నుంచి పవర్‌గ్లాన్స్‌ విడుదలైంది. ఈ వీడియోలో పవన్‌ లుక్‌, మేనరిజం పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మీరూ దీన్ని చూసేయండి.

Pawankalyan Harihara veeramallu glimpse
హరిహర వీరమల్లు

By

Published : Sep 2, 2022, 11:02 AM IST

పవర్‌స్టార్‌ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' నుంచి పవర్‌గ్లాన్స్‌ విడుదలైంది. శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం ఈ వీడియో షేర్‌ చేసింది. "మెడల్ని వంచి, కథల్ని మార్చి, కొలిక్కి తెచ్చే పనెట్టుకొని.. తొడకొట్టాడో తెలుగోడు" అంటూ సాగే పాటతో విడుదలైన ఈ వీడియోలో పవన్‌ లుక్‌, మేనరిజం పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మల్లయోధులతో ఆయన పోరాటం చేస్తున్న దృశ్యాలకు తగ్గట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుతో సాగే ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

హిస్టారికల్‌ చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ సిద్ధమవుతోంది. మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే సగం సినిమా షూట్‌ పూర్తైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. దయాకర్‌రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు.

ఇదీ చూడండి:పవన్ కల్యాణ్​​ సినిమాల్లోకి రాకముందు ఇన్ని రంగాల్లో పనిచేశారా?

ABOUT THE AUTHOR

...view details