తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​ 'OG' రిలీజ్​ డేట్​.. ఇది మరీ టు మచ్​ సార్​! - పవన్​కల్యాణ్ సుజిత్​ ఓజీ మూవీ రిలీజ్

పవన్​ కల్యాణ్​ ఓజీ సినిమా రిలీజ్ డేట్​ గురించి ఓ అప్డేట్​ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఇది తెలుసుకున్న అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు...

Pawankalya director sujeeth OG movie release on 2025 sankranthi
పవన్​ 'OG' రిలీజ్​ డేట్​.. ఇది మరీ టూ మచ్​ సార్​!

By

Published : Apr 24, 2023, 9:38 PM IST

పవర్​స్టార్​ పవన్ కల్యాణ్.. హిట్టు, ఫ్లాప్​తో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు​. ఆయన పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలే. ఆనందంతో గెంతులేస్తారు. ఆయన తెరపై కనిపడితే థియేటర్​ దద్దరిల్లేలా గోల పెడతారు. అలాంటిది పవన్ సినిమా వస్తుందంటే చాలా ఫ్యాన్స్​ ఆనందానికి అవధులు ఉండవు.

అయితే గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమాల్లో దూకుడు ప్రదర్శిస్తూ వరుస సినిమాలకు గ్రీన్​ ఇస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ రీమేక్ చిత్రాలకు ఓకే చెబుతూ.. షూటింగ్​లలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన సాహో ఫేమ్​ దర్శకుడు సుజిత్ డైరెక్షన్​లో ఓ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమాకు ఓకే చెప్పారు. ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్​ అప్డేట్ వచ్చింది.

ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్​లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి అయితే ఓకే కానీ.. మరీ 2025 సంక్రాంతి అంటే చాలా ఆలస్యమని.. రెండేళ్లు ఆగలేమని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు కోసం రెండేళ్లుగా వెయిట్​ చేయలేకపోతున్నామని.. ఇప్పుడు మళ్లీ ఓజీ కోసం కూడా మరో రెండేళ్లు ఎదురుచూడాలా అని తమ బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే రీసెంట్​గా పవన్ కల్యాణ్​.. షూటింగ్​ సెట్​లోని లుక్​ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పవన్ తన కాస్త స్లిమ్​గా కనిపించారు. అయితే మరోవైపు పవన్​.. ఓటీతో పాటు ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్​ భగత్​సింగ్​ సినిమాలోనూ నటిస్తున్నారు. మరి ఈ కొత్త లుక్​తోనే ఈ రెండు సినిమాల్లో కనిపిస్తారా లేదా తెలియాల్సి ఉంది.

పవన్ ఓజీ లుక్​

హీరోయిన్​గా​ ప్రియాంక మోహన్​.. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటించనుంది. ఈ విషయాన్ని మూవీటీమ్​ కూడా అధికారికంగా ప్రకటించింది. పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసింది. ఆర్​ఆర్​ఆర్​ లాంటి బిగ్గెస్ట్​ బ్లాక్​బాస్టర్​ను నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి:16ఏళ్ల సమంత.. 50 ఏళ్ల మలైక.. క్యూట్ అండ్ హాట్​గా కిక్​ ఎక్కించారుగా!

ABOUT THE AUTHOR

...view details