trivikram bro movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు దాదాపుగా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటాయి. ఆయన చిత్రంలోని డైలాగ్స్ సినీ అభిమానులను బాగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల క్లైమాక్స్.. హైలైట్‌గా నిలుస్తుంటాయి. తనదైనా స్టైల్లో ఎంతో అద్భుతంగా, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో రూపొందిస్తుంటారు.
అయితే సినీ ప్రియుల్లో పవన్-త్రివిక్రమ్ కాంబోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబోలో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' మంచి హిట్‌ను అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌గా నిలిచినా.. అనంతరం 'భీమ్లానాయక్' మంచి హిట్‌ను అందుకుంది. అయితే 'భీమ్లానాయక్'కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించలేదు. స్క్రీన్ ప్లే, మాటలు మాత్రమే అందించారు.
అయితే త్రివిక్రమ్ ఇప్పుడు.. పవన్ నటిస్తున్న 'బ్రో' చిత్రానికి కూడా మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా 'వినోదయం సీతమ్'కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ దీన్ని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్‌ను కూడా తనదైన మార్క్ స్టైల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో మాటల మాంత్రికుడు తీర్చిదిద్దారని సమాచారం అందింది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా.. అలాగే ఆడియెన్స్, అభిమానుల మనసును తాకేలా క్లైమాక్స్ సన్నివేశాలను, సంభాషణలను రూపొందించారట.